మరమతుల పనులు శంకుస్థాపన జడ్పీ కో ఆప్షన్ మోషన్ అలీ

మరమతుల పనులు శంకుస్థాపన జడ్పీ కో ఆప్షన్ మోషన్ అలీ

అక్షిత న్యూస్ మాడుగులపల్లి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మారుమూల గ్రామాలకు సైతం రహదారులు నిర్మాణం చేయించడంలో ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది రాష్ట్ర ప్రభుత్వం అన్ని మారుమూల గ్రామాలకు పక్కా బీటీ రోడ్లు ఉండాలనే ఉద్దేశంతో ఆర్ అండ్ బి శాఖ ద్వారా 3 కోట్ల 50 లక్షల రూపాయల వ్యయంతో మాడ్గులపల్లి మండలం కుక్కడం గ్రామం నుంచి పాములపహాడ్ గ్రామం వయా గండ్రవాని గూడెం తోపుచర్ల,బొమ్మకల్,భీమనపల్లి, కల్వలపాలెం వరకు19 కిలోమీటర్ల మేర బి టి రెన్యువల్ రోడ్డు నిర్మాణ పనులను ఈ రోజు నల్గొండ జిల్లా జడ్పీ కో ఆప్షన్ సభ్యులు మోషన్ అలీ మాడ్గులపల్లి మండల ప్రజాప్రతినిధులు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఈ రోడ్డును మా మండల ప్రజల విజ్ఞప్తి మేరకు శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు ఎప్పుడో మంజూరు చేయించారు. టెండర్ జాప్యం కావడం వలన ఇన్ని రోజులు ఆగి ఇప్పుడు టెండర్ ప్రాసెస్ పూర్తి చేసుకొని ఈ రోజు అట్టి పని నిర్మాణ పనులను శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఈ సందర్బంగా మాడ్గులపల్లి మండల ప్రజల తరపున శాసనసభ్యులు భాస్కర రావు కి ధన్యవాదాలు తేలపుతున్నాము అన్నారు దీనిని కొంతమంది రాజకీయ నాయకులూ పార్టీ సిపిఐఎం వారు, వారి హయాములో ఏమి చేయలేక ఏమైంది వాళ్ళేదో మండలానికి ఘనకార్యం చేసినట్టు రోడ్డు వేయించకపోతే పాదయాత్ర చేస్తాం, ధర్నాలు చేస్తాం అని ప్రకటిస్తున్నారు. వాళ్ళ హయంలో ఏ గ్రామములో తట్టెడు మట్టి పోయలేదు కాగా, గ్రామాలు కనీస అభివృద్దికి నోచుకోలేదు కావున వారి మాటలు ఎవ్వరు నమ్మే పరిస్థితిలో లేరని తెలిపారు. మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లబోతు భాస్కర్ రావు ఇప్పుడు రెండవ సారి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మాకు ప్రజామస్యల పట్ల అవగాహనా ఉంది కావున మండలములో ఎస్ డి ఎఫ్ , సిడిపి, పీఎంజైజీ , ఎనర్జీ ఎస్ తెలంగాణా రాష్ట్ర పల్లె ప్రగతి కింద దాదాపు 226 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేయించి, నూతన చెక్ డ్యామ్ ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయించిన ఘనత మా ఎమ్మెల్యేకే దక్కింది. గడచిన నాలుగేళ్ళలో మాడ్గులపల్లి మండలాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తున్నారు. కాబట్టి వాళ్ళు ధర్నా చేసిన, పాదయాత్ర చేసిన వాళ్ళను ఎవ్వరు నమ్మరు ప్రజల్లో విశ్వాశం కోల్పోయారని ఎద్దేవా చేసారు. మాడ్గులపల్లి మండల ప్రజల పట్ల మా బిఆర్ఎస్ పార్టీకే చిత్తశుద్ది ఉందని తెలిపారు. ఇంకొక సారి ఇటువంటి అబద్దపు మాటలు చెప్పి పబ్బం గడుపుకోవాలని చూసి, ప్రజలను తప్పు దోవ పట్టించేలా ప్రకటనలు చేస్తే ఊరుకోబోమని స్పష్టం చేస్తూ అల్టిమేటం జారి చేసారు. మీకు అభివృద్ది విషయంలో ఎమైన అనుమానం ఉంటె చర్చకు రావాలని అని సవాల్ విసిరారు. కార్యక్రమములో జిల్లా పరిషత్ కో-ఆప్షన్ మెంబర్ ఎండీ మోషిన్ అలీ, మండల బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు పాలుట్ల బాబయ్య, సర్పంచ్ లు అలుగుబెల్లి గోవింద రెడ్డి, యాతం లక్ష్మి నరేందర్ రెడ్డి, చిత్తలూరి శ్రీనివాస రెడ్డి, గడ్డమీది సైదులు, మేకల లింగమ్మ నాగయ్య, వెంకట్ రెడ్డి నాయకులు జలంధర్, కర్ర శ్రీనివాస రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, చింతకుంట్ల వెంకట్ రెడ్డి, నుకపంగ సోమయ్య, రామస్వామి తదితరులు పాల్గొన్నారు. అనంతరం మాడుగులపల్లి ఎంపీపీ పోకల శ్రీవిద్య రాజు కార్యక్రమం అయిపోయినా ఐదు నిమిషాల తర్వాత వచ్చి రోడ్డుపై నిరసన కార్యక్రమం తెలపడం జరిగింది కార్యక్రమానికి పిలిచి మమ్మల్ని అవమానించడం ఎంతవరకు న్యాయమని అధికారులను ప్రశ్నించడం జరిగింది

Leave A Reply

Your email address will not be published.

Breaking