రాజస్థాన్‌లోని జైపూర్‌లో జికా వైరస్ కేసులు బయటపడ్డాయి. ఏడుగురు జికా వైరస్ పరీక్షలో పాజిటివ్‌గా తేలారు. ఈ ఘటన పట్ల ప్రధాన మంత్రి కార్యాలయం అప్రమత్తత ప్రకటించింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ నుంచి మరింత సమాచారాన్ని సేకరిస్తోంది. ఆరోగ్య మంత్రిత్వశాఖకు చెందిన ఓ బృందం జైపూర్‌కు వెళ్లనున్నది. సెప్టెంబర్ 24వ తేదీన ఓ వ్యక్తి జికా వైరస్ పరీక్షలో పాజిటివ్‌గా తేలాడు. ఆ తర్వాత సుమారు 22 శ్యాంపిళ్లను పుణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపారు. జైపూర్‌లో జికా వైరస్ వ్యాప్తిపై సమగ్రమైన నివేదిక ఇవ్వాలని పీఎంవో ఆరోగ్యశాఖకు ఆదేశాలు జారీ చేసింది.
జికా వైరస్ సోకిని ఏడుగుర్ని జైపూర్‌లోని ఎస్ఎంఎస్ హాస్పటల్లో చేర్పించారు. రాజస్థాన్ ఆరోగ్యశాఖ వారిపై నిఘా పెట్టింది. జైపూర్‌లోని శాస్త్రినగర్‌లో మొదటి కేసు నమోదు అయ్యాయి. అక్కడ మెడికల్ టీమ్‌లను ఏర్పాటు చేశారు. మొత్తం 179 వైద్య బృందాలు ఆరు వార్డుల్లో పనిచేస్తున్నారు. బీహార్ కూడా అన్ని జిల్లా ఆరోగ్యశాఖలకు ఆదేశాలు జారీ చేసింది. జైపూర్‌లో జికా సోకిన వ్యక్తుల్లో బీహారీ ఉన్నాడు. అతను ఈమధ్యే సివాన్‌కు వచ్చి వెళ్లాడు. దీంతో బీహారీలపైన కూడా నిఘా పెట్టారు. గత ఏడాది బ్రెజిల్లో జికా వైరస్ తీవ్ర సమస్యలు సృష్టించిన విషయం తెలిసిందే. వైరస్ సోకిన గర్భిణులు.. మైక్రోసెఫాలీ వ్యాధితో బాధపడే పిల్లల్ని ప్రసవించారు.
Tags:Zika Virus , Jaipur , Positive Cases , PMO , Rajasthan Health Department