వైఎస్ షర్మిల పార్టీ సేవలో… పికే టీమ్

వ్యూహకర్తగా  ప్రశాంత్ కిషోర్ శిష్యురాలు ప్రియ

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

వైఎస్‌ షర్మిల‌కు కొత్త వ్యూహకర్త నియమితులయ్యారు. ప్రశాంత్ కిషోర్ శిష్యురాలు ప్రియ ఇక నుంచి షర్మిలకు వ్యూహకర్తగా వ్యవహరించనున్నారు. త‌మిళ‌నాడు డీఎంకే ఎమ్మెల్యే రాజేంద్రన్‌ కూతురు ప్రియ. లోట‌స్‌పాండ్‌లో ష‌ర్మిల‌ను వ్యూహకర్త ప్రియ క‌లిశారు. సోష‌ల్ మీడియాతో పాటు, పార్టీ వ్యూహాల‌పై ష‌ర్మిల‌కు వ్యూహ‌క‌ర్తగా ప్రియ వ్యవ‌హ‌రించనున్నారు. ప్రియ త‌మిళ‌నాడులో ఓ మీడియాకు ప్రియ అధినేతగా ఉన్నారు. తెలంగాణలో వైఎస్ షర్మిల కొత్త పార్టీని పెట్టనున్న విషయం తెలిసింది. వైఎస్ జయంతి సందర్భంగా ఆమె పార్టీ పేరు ప్రకటించనున్నారు. ఇప్పటికే ఆమె తెలంగాణలోని పలు సమస్యలపై నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ షర్మిల పార్టీ బలోపేతంపై ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా షర్మిల అనుసరించాల్సిన వ్యూహాలపై ఆమె కొత్త వ్యూహకర్తను నియమించుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *