ఆధ్యాత్మికతకు తోడు వ్యవసాయ క్షేత్రం

తిరుపతి తరహాలో…యాదాద్రి లోనూ

నిత్య కైంకర్యంలో వినియోగించే ప్రతిదీ… పండించాలి

 

యాదాద్రి, అక్షిత ప్రతినిధి : ఆధ్యాత్మికతకు తోడు వ్యవసాయ క్షేత్రం విస్తరించనుంది. తిరుపతి తరహాలో యాదాద్రిలోనూ నిత్య కైంకర్య సేవల్లో వినియోగించే ప్రతిదీ ఇక్కడే పండించేందుకు వ్యూహం. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దుతున్న యాదాద్రి దేవాలయం పునర్నిర్మాణంలో భాగంగా ఆలయానికి అనుసంధానంగా వ్యవసాయ క్షేత్రాన్ని అభివృద్ధి చేసే దిశగా ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారులను ఆదేశించినట్లు విశ్వసనీయ సమాచారం తిరుపతి దేవస్థానం తరహాలో యాదాద్రి దేవాలయంలో జరిగే నిత్య కైంకర్య సేవలకు వినియోగించే పూలు అలంకరణ వస్తువులు మామిడి తోరణాలు అరటి కొమ్మలు కొబ్బరి మట్టలు నిత్యాన్నదానం ప్రసాద శాలల్లో అవసరమయ్యే కూరగాయలు ఆకుకూరలు కొనుగోలు చేయకుండా దేవస్థానం అవసరాలను పూర్తి చేసే విధంగా వ్యవసాయ క్షేత్రాన్ని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నారు.వ్యవసాయ క్షేత్రంలో కొబ్బరి చెట్లు అరటి చెట్లు పూల తోటలు ప్రసాదాలు వినియోగించే కరివేపాకు కొత్తిమీర పుదీనా ఇతర మొక్కలను చెట్లను పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లుగా అధికారులు తెలియజేశారు. ఆ దిశగా వ్యవసాయ క్షేత్రానికి అవసరం ఉన్నంత అవసరమైనంత భూమిని సేకరించేందుకు అధికారులు భూ వనరులను గుర్తిస్తున్నట్లుగా అనధికారికంగా తెలిపారు స్వామి
వారి నిత్యకైంకర్యాలు బ్రహ్మోత్సవాలు, వార్షికోత్సవాలు, జయంతి ఉత్సవాలు ఉత్సవాల నిర్వహణలో అవసరమయ్యే పూలను, సాంప్రదాయ రీతిలో స్వామి వారి వ్యవసాయ క్షేత్రంలోని మొక్కలను పెంచాలని అదేవిధంగా స్వామివారి ప్రసాదాల తయారీలో అవసరమయ్యే ఆకుకూరలు,కాయగూరలను సరఫరా చేసేందుకు కూరగాయ మొక్కలను పెంచేందుకు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయాలని అని ఆలోచిస్తుండగా సమాచారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ సహాయ సహకారాలతో స్వామివారి ఉద్యానవనం వ్యవసాయ క్షేత్రాన్ని ప్రత్యేకమైన రీతిలో అభివృద్ధి చేసేందుకు యంత్రాంగం తగు చర్యలు చేపడుతున్నారు. గతంలో స్వామి వారికి అలంకరించేందుకు ప్రత్యేకంగా తులసి తోటను ఏర్పాటు చేశారు కానీ స్వామివారి ఆలయ పునర్నిర్మాణం అభివృద్ధిలో భాగంగా తులసి తోటలో పలు నిర్మాణాలు చేపట్టడం జరిగింది ఏది ఏమైనప్పటికీ యాదాద్రి అభివృద్ధిలో భాగంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఉద్యానవనం వ్యవసాయ క్షేత్రం నిర్మాణం న భూతో న భవిష్యత్ అనే విధంగా యాదాద్రి క్షేత్ర అభివృద్ధికి ధీటుగా చేపట్టేందుకు అధికార యంత్రాంగంసమాయత్తమవుతోంది. యాదాద్రి దేవాలయానికి ప్రస్తుతం మల్లాపురం, సైదాపూర్ శివారులో వ్యవసాయ క్షేత్రం ఉంది. ఆలయం అభివృద్ధి చెందిన తర్వాత ఈ వ్యవసాయ క్షేత్రం కూడా విస్తరించాలనే సంకల్పంతో మల్లాపురం, సైదాపురం శివార్లలో భూమిని తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రాంతంలో మల్లాపురం చెరువు ఉండడంతో వ్యవసాయ క్షేత్రానికి సరిపడా నీరు అందుబాటులో ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతంలోనే వ్యవసాయ భూమిని సేకరించాలని అధికారులు భావిస్తున్నారు. కొంత భూమిని కూడా యాదగిరిగుట్ట వాసులు స్వామి వారికి అప్పగించవలసి వస్తుందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

తుది దశకు రింగ్ రోడ్డు

యాదాద్రి రింగురోడ్డు తుదిదశ ఆధ్యాత్మిక పర్యాటక పుణ్యక్షేత్రంగా రూపుదిద్దుకుంటున్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి కొండ చుట్టూ ఆరులేన్ల రింగురోడ్డు నిర్మాణం దాదాపు పూర్తికావస్తోంది. అంత ర్జాతీయ ప్రమాణాలతో సుమారు రూ.10 కోట్ల వ్యయంతో ఈ రోడ్డును నిర్మిస్తుండగా పనులు తుది దశకు చేరాయి. యాదాద్రి పునర్నిర్మాణం పూర్తయితే దేశ విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు సందర్శించే అవకాశం ఉండటంతో అదే స్థాయిలో సకల సదుపాయాలు చేకూర్చాలని సీఎం నిర్ణయించారు. ఈ క్రమంలో యాదాద్రి కొండచుట్టూ ఆరులేన్ల రింగ్ రోడ్డు నిర్మాణానికి అధికారులను ఆదేశించారు . దీంతో కొండచుట్టూ కిలోమీటర్ల పొడవుతో ఆరులేన్ల రోడ్డు నిర్మాణానికి ఆర్కిటెక్ట్ ముసాయిదా డిజైన్లను రూపొందించారు. అనంతరం దీనికి సీఎం ఆమోదం తెలపాలసి ఉంది. రూ.113 కోట్ల అంచనా వ్యయంతో పనులకు వైటీడీఏ శ్రీకారంచుట్టి క్లబ్ లకు అప్పగించారు. 2018 జూలై నెలలో ఈ రోడ్డు పనులు ప్రారంభం కాగా, మూడేళ్ల అనంతరం తుదిదశకు చేరాయి. యాదాద్రి కొండకు నాలుగు దిశల నుంచి వచ్చే మార్గాలను ఈ ఆరులేన్ల రింగురోడ్డుకు అనుసందానం చేశారు. 165 అడుగుల వెడల్బుతో అంతర్జాతీయ ప్రమాణాలతో పనులు జరుగుతున్నాయి పట్టణంలో అవసరమైన మేరకు మాత్రమే భూసేకరణ చేసి పనులు నిర్వహిస్తున్నారు. రింగురోడ్లు చుట్టూ తెలుగు సర్కిళ్లు ఏర్పా ట్లు చేశారు. రెండో అప్రోడోడ్డు ప్రెసిడెన్సియల్ సూట్కు వెళ్లే రహదారీ, ఆన్ స్టేషన్, ఐన్ టర్నిషల్ వచ్చే ప్రాంతం, కొండకింద ప్రధాన రహదారిలోని వైకుంఠ ద్వారం ప్రాంతాల్లో ఈ సర్కిళ్లను ఏర్పాటు చేశారు. రహదారికి ఇరువైపులా ప్రైవేట్ గా నిర్మిస్తున్నారు. అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసి రహదారికి ఇరువైపులా సెంటర్ మెడన్లో మొక్కలు నాటనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *