వీఆర్ ఓల సర్వీస్ కు భంగం కల్గించోద్దు

వీఆర్వోలకు స్పష్టమైన విధులు బాధ్యతలు అప్పగించాలి

-తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం

ఖమ్మం / అక్షిత బ్యూరో : రద్దుకాబడిన వీఆర్వోలకు గత సర్వీసుకు ఎటువంటి భంగం కలగకుండా వారి గత హోదాకు తగ్గకుండా స్పష్టమైన విధులు బాధ్యతలు అప్పగించాలని తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షకార్యధర్శులు షేక్ నాగుల్ మీరా నాగేంద్రబాబులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.నిన్న ఖమ్మం టీటిడిసిలో తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం జరిగిన జిల్లా 6 వ మహాసభ సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వం రద్దుకాబడిన గ్రామ రెవెన్యూ అధికారులను వేరే శాఖలోకి బదిలీ చేయదలిస్తే వారినుండి అప్షన్స్ తీసుకొని వారి గత హోదాకు తగ్గకుండా ఉండే విధులు కల్పించాలన్నారు. ప్రస్తుతం రెవెన్యూ కార్యాలయాల్లో ఖాళీలు పెరిగినందున రద్దుకాబడిన గ్రామ రెవెన్యూ అధికారులను వారి అర్హతను బట్టి రెవెన్యూ శాఖలొనే సర్దుబాటు చేయాలని అర్హత కలిగిన వారికి వెంటనే పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరోనా భారినపడి ప్రాణాలు కోల్పోయిన గ్రామ రెవెన్యూ అధికారులకు పది లక్షల ఎక్స్-గ్రేషియా ప్రకటించి వారి కుటుంబంలో వెంటనే కారుణ్యానియామకాలు చేపట్టాలన్నారు. వివిధ కారణల వల్ల సస్పెన్షన్ కు గురి అయి ఉన్న గ్రామ రెవెన్యూ అధికారులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న 6,12,18 సంవత్సరాల ఇంకిమెంట్లు సర్వీసు రెగ్యులరైజేషన్ వంటి వాటిని వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వం నుండి కానీ  ముఖ్యమంత్రి నుండి కానీ ఎటువంటి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసే వరకు మండలాల్లో ఉన్నటువంటి తహశీల్దార్లు చట్టానికి వ్యతిరేకంగా విధులు అప్పగించరాదని కోరారు. గ్రామ రెవెన్యూ అధికారుల వ్యవస్థ రద్దు తరువాత కూడా మరియు ప్రభుత్వ చట్టానికి వ్యతిరేకంగా మండలాల్లోని తహశీల్దార్లు వ్యవస్థ రద్దుకు పూర్వం నిర్వహించిన విధులే నిర్వహింపజేయడం అట్టి విధులు చట్టవిరుద్దం అని వారించిన గ్రామ రెవెన్యూ అధికారులను తహశీల్దార్లు జీతభత్యాలు నిలుపుదల చేస్తామని బెదిరింపులకు గురిచేస్తూ తీవ్ర ఒత్తిడులకు గురిచేస్తూ చట్టవ్యతిరేకంగా విధులు నిర్వహింపజేస్తున్నారు. మరికొంతమంది తహశీల్దార్లు మరింత బెదిరింపులకు గురి చేస్తూ భూసంబంధ విధులు కూడా నిర్వహింపజేస్తున్నారు. ఇట్టి విషయంలో కలెక్టర్ కి ఏ హోదాతో విధులు నిర్వహించాలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేయవలసిందిగా ఎన్ని పర్యాయాలు వినతిపత్రాల ద్వారా వేడుకున్న ఎటువంటి ప్రయోజనం చేకూరలేదు. చట్టసభల ద్వారా ఆమోదం పొందిన చట్టాలకు వ్యతిరేకంగా ఆయా మండలాల తహశీల్దార్లు విధులు నిర్వహింపజేస్తున్నారు అని గౌరవ జిల్లా కలెక్టర్ లకు తెలిసినప్పటికీ మరియు వారి దృష్టికి విషయాన్ని తీసుకెళ్లినప్పటికి వారు చూసి చూడనట్టుగా వ్యవహరించడం చాలా బాధాకరం.ఇట్టి పరిస్థిని కలెక్టర్ చొరవ తీసుకొని వెంటనే రద్దుకాబడిన గ్రామ రెవెన్యూ అధికారులకు స్పష్టమైన విధివిధానాలు రూపొందించే దిశగా అడుగులు వేయలేని కోరారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ కి సైతం వినతిపత్రం అందించారు.ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా నాయకులు ధారవత్ భాస్కర్ షేక్ జానీమీయా, బాలయ్య, మస్తాన్, తాటి ఇందిర, శీలం వెంకటెశ్వర్లు, బంక భాస్కర్ రావు తదితురులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *