వరలక్ష్మి పూజలకు ముస్తాబు

రామలింగేశ్వరస్వామి
దేవాలయంలో ముందస్తు ఏర్పాట్లు
నెక్కొండ, అక్షిత న్యూస్ : రామలింగేశ్వరస్వామి దేవాలయంలో శుక్రవారం రోజున సామూహిక శ్రీ వరలక్ష్మీ వ్రతాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు బివియన్ శాస్త్రి తెలిపారు. ఆలయంలో కొలువుదీరిన లక్ష్మీ అమ్మవారి ఉత్సవ విగ్రహానికి శ్రీసూక్త విధానంలో పంచామృత అభిషేకాలు నిర్వహించిన అనంతరం11 గంటలకు వరలక్ష్మీ వ్రతాలనునిర్వహిస్తారని తెలిపారు .ఈ సందర్భంగా అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహిస్తామన్నారు.ఉదయం పది గంటలకు పూజలు ప్రారంభమవుతాయని తెలిపారు. ఏటా నిర్వహించే ఈ వేడుకల్లో మహిళలు,భక్తులు పూజాది కార్యక్రమాల్లో పాల్గొని స్వామి,అమ్మవార్ల కృపకు పాత్రులు కాగలరని కోరుతున్నాం..సామూహిక వరలక్ష్మి వ్రతాలు చేసుకునేందుకు వచ్చే భక్తుల కోసం గ్రామపంచాయతీ సర్పంచ్ సొంటిరెడ్డి యమునా రంజిత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయాన్ని శుభ్రం చేసి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *