వైకుంఠ దామాలు నెల రోజుల్లో పూర్తి చేయాలి

– జిల్లా అడిషనల్ కలెక్టర్ మను చౌదరి

తెలకపల్లి , అక్షిత న్యూస్ :

మండలంలోని వివిధ గ్రామాలలో పెండింగ్లో ఉన్న వైకుంఠ దామాలు నెల రోజుల లోపల( సెప్టెంబర్ 10 -2021) పూర్తిచేయాలని నాగర్ కర్నూలు జిల్లా అదనపు కలెక్టర్ మను చౌదరి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని గట్టు నెల్లికుదురు, కమ్మ రెడ్డి పల్లి గ్రామాలలోని వైకుంఠ దామాలను పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పనులలో నిర్లక్ష్యం వద్దని వెంటనే యుద్ధ ప్రాతిపదికన వైకుంఠ దామాల పనులు పూర్తిచేయాలని సర్పంచ్ లను ఆదేశించారు గ్రామాల అభివృద్ధి పనులను సరైన సమయాలలో పూర్తిచేయాలని గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ఎన్నో రకాల సంక్షేమలను ఏర్పాటు చేయుచున్నదని ప్రజా ప్రతినిధులు అధికారులు చొరవ తీసుకుని ప్రజలకు చేరువ చేసి స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దాలని సూచించారు. అదే విధంగా అభివృద్ధి నిధులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో అజార్ మైన్ ఉద్దీన్, ఎం పీ ఓ వెంకట్ ఏపీవో శ్యామ్ గ్రామాల సర్పంచులు సుగుణమ్మ బాబుగౌడ్, సుల్తాన్ పంచాయతీ కార్యదర్శులు ఎంపిడిఓ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *