వడ్డేపల్లికి విశిష్ఠ బహుమతి

కార్టూన్ల పోటీలో
వడ్డేపల్లికి విశిష్ట బహుమతి
రమణాచారి చేతుల మీదుగా పురస్కారం

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

తొలితెలుగు కార్టూనిస్ట్ తలిశెట్టి రామారావు జయంతి సందర్బంగా హస్యానందం మాసపత్రిక సత్కళా భారతి సంస్థ సంయుక్తంగా ప్రతీ ఏటా నిర్వహించే కార్టూన్ల పోటీలో ప్రముఖ కార్టూనిస్ట్ ఉపాధ్యాయులు వడ్డేపల్లి వెంకటేష్ విశిష్ట బహుమతి అందుకున్నారు. ఆదివారం హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన ఈ కార్యక్రమంలో ఈ బహుమతిని తెలంగాణా ప్రభుత్వ సలహాదారు
డాక్టర్ కేవి రమణా చారి చేతుల మీదుగా వడ్డేపల్లి అందుకున్నారు.కాగా ఈ వేదిక పై ఇప్పటికి 10 కార్యక్రమాలు జరగగా వడ్డేపల్లి 8 వ సారి విశిష్ట పురస్కారం అందుకున్నారు. ఈ కార్యక్రమంలో హస్యానందం ఎడిటర్ రాము తనికెళ్ళ భరణి రమణాచారి కార్టూనిస్ట్ శంకు మాటల రచయిత జనార్ధన మహర్షి పాల్గొన్నారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఇరు రాష్ట్రాల కార్టూనిస్టులు పాల్గొన్నారు. ఈ పురస్కారం రావడం పట్ల వడ్డేపల్లి
తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *