ప్రతి ఒక్కరు వ్యాక్సినేషన్ తీసుకోవాలి

మహబూబ్నగర్, అక్షిత బ్యూరో: నాగర్ కర్నూలు జిల్లాలోని లింగాల మండల పరిధిలోని అంబటిపల్లి, అప్పాయిపల్లి, ఎర్ర పెంట , సాయిన్ పేట్, గ్రామాలలో శ్రామిక వికాస కేంద్రం, చిల్డ్రన్ ఫౌండేషన్ ఇండియా ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు వ్యాక్సిన్లు తీసుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది, వ్యాక్సిన్ తీసుకోకుండా ఉంటే వచ్చే సమస్యల గురించి, వ్యాక్సిన్ తీసుకుంటే ఆరోగ్యకరంగా ఉంటారని ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది, ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలి, శుభ్రంగా కడుక్కోవాలి, దగ్గు జలుబు జ్వరం వచ్చినట్లయితే ఆస్పత్రి వైద్యుల సంప్రదించాలని కోరారు, అనంతరం లింగాల అంబటిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మెడికల్ ఆఫీసర్ ల తో మాట్లాడటం జరిగింది, ఎస్ వి కే సంస్థ మరియు చిల్డ్రన్ ఫౌండేషన్ సంస్థలు వ్యాక్సినేషన్ పైన అవగాహన కల్పించడం చాలా మంచిదని, తమ వంతు సహకారం కూడా ఉంటుందని వైద్యాధికారులు శ్వేత, శ్రీనివాస్ గుప్తా, తెలిపారు , ఈ కార్యక్రమంలో ఎస్ వి కె సిబ్బంది విష్ణు, శ్రీనివాసులు, ప్రమీల, తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *