ఊరూరా… పల్లె ప్రగతి

అచ్చంపేట, అక్షిత ప్రతినిధి :

రంగాపూర్ గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమం అచ్చంపేట అక్షిత న్యూస్ జూలై 4 తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంలో నాలుగవ రోజైన ఆదివారం అచ్చంపేట మండలంలోని రంగాపూర్ గ్రామంలో సర్పంచ్ లోక్యా నాయక్ ఆధ్వర్యంలో ఆదివారం పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో గ్రామ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు ఆర్డిఓ పాండు నాయక్, తాసిల్దార్ చంద్రశేఖర్, జడ్పిటిసి మంత్రి నాయక్ పాల్గొని పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించారు. అనంతరం గ్రామంలోని ప్రధాన రహదారుల్లో హరితహారం కార్యక్రమం నిర్వహించి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అన్నారు. హరితహారం కార్యక్రమంలో ప్రభుత్వం నిర్దేశించిన మొక్కలను నాటి నాటిన మొక్కలను సంరక్షించాలి అని సూచించారు. ఈ బాధ్యత గ్రామ పంచాయతీ అధికారులు సర్పంచులు బాధ్యతలు తీసుకోవాలని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *