ఉమా మహేశ్వర ఆలయానికి దాతల వివరాలు

అచ్చంపేట, అక్షిత న్యూస్ :
మండలంలోని శ్రీశైల ఉత్తర ముఖద్వారమైన శ్రీ ఉమామహేశ్వర పుణ్యక్షేత్రాన్ని సోమవారం అచ్చం పేటకు చెందిన సిండికేట్ వ్యాపారులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కోసం లక్ష 116 రూపాయలను ఆలయ చైర్మన్ కందూరి సుధాకర్ కు అందజేశారు.అనంతరం వారు మాట్లాడుతూ ఆలయ చైర్మన్ సుధాకర్ ఆధ్వర్యంలో ఆలయం దిన దినాభివృద్ధి జరుగుతుందని, ఆలయ ప్రాంగణంలో భక్తుల కోసం ఏర్పాటుచేసిన గదులను, ఆలయ ప్రాంగణంలో వాహనాల కోసం ఏర్పాటుచేసిన పార్కింగ్ ,మరియు నిత్య అన్నదానం వంటి సౌకర్యాలు భక్తులకు ఏర్పాటు చేయడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం దాతలను ఆలయ చైర్మన్ సుధాకర్, ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు వారిని శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. దాతల సిండికేట్ వ్యాపారులో ఆలయ చైర్మన్ కందూరు సుధాకర్ ఒకరు కావడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *