ఉద్యమంలా పట్టణ ప్రగతి

మౌళిక సదుపాయాల కల్పన

అరూరి రమేష్

ఖాజీపేట, అక్షిత ప్రతినిధి : రాష్ట్రంలో ప‌చ్ఛ‌ద‌నం, ప‌రిశుభ్ర‌త పెంపొందించాల‌నే ల‌క్ష్యంతో నాలుగ‌వ విడ‌త ప‌ల్లె, పట్టణ ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వ‌హిస్తోందని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్  తెలిపారు. గ్రేటర్ వరంగల్ 1&2 డివిజన్ల పరిధిలోని పెగడపల్లిలో నిర్వహించిన పట్టణ పట్టణ ప్రగతి కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణితో కలిసి ఎమ్మెల్యే అరూరి రమేష్  పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అరూరి రమేష్ , మేయర్ గుండు సుధారాణి  దళిత వాడలలో పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని స్థానిక ప్రజలకు హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే అరూరి రమేష్  మాట్లాడుతూ పారిశుధ్యం, మౌళిక స‌ధుపాయాలు, ఆరోగ్యం, హ‌రిత‌హారం, విద్యుత్తు స‌మ‌స్య‌ల ప‌రిష్కారం మొద‌ల‌గు అంశాల‌కు ఈ కార్య‌క్ర‌మంలో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజా ప్రతినిధులకు, అధికారులకు సూచించారు. పర్యావరణం, పారిశుద్ధ్యం, పచ్చదనంపై ప్రజల్లో మరింత అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతిలో అందరూ భాగస్వాములై సమగ్ర అభివృద్ధి సాధించెందుకు పాటుపడాలని పిలుపునిచ్చారు. పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా, రోడ్లు, నర్సరీలు, శ్మశానవాటికలు, మోడల్‌ మార్కెట్లు, పార్కులు, డంప్‌యార్డుల ఏర్పాటుకు ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గత ఏడేళ్ల కాలంలో రాష్ట్రంలో అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల సంక్షేమం, అభివృద్ది కోసం ఎన్నో వినూత్న‌మైన ప‌థ‌కాల‌ను రాష్ట్రంలో అమ‌లు చేస్తున్నార‌ని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతుబంధు, రైతు భీమా, క‌ళ్యాణ‌ల‌క్ష్మి, ఆస‌రా పెన్ష‌న్లులాంటి దాదాపు 100కు పైగా ప‌థ‌కాల‌ను రాష్ట్రంలో అమ‌లు చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంమని ఎమ్మెల్యే అరూరి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *