భవిష్యత్ రూపకర్త కేటీఆర్ – ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

  • భవిష్యత్ రూపకర్త కేటీఆర్ 
  • ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

కూకట్ పల్లి, అక్షిత ప్రతినిధి: ఒక నాయకుడుకు కావాల్సిన అన్ని లక్షణాలు కల్వకుంట్ల తారక రామారావుకు ఉన్నాయని , ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం ఆయనది అని శేరిలింగంపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు , ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు,రాష్ట్ర మంత్రి తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన సందర్భంగా రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ నిర్వహిస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ముక్కోటి వృక్షర్చన కార్యక్రమం లో భాగంగా హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని నిజాంపేట్ మెట్రో రోడ్డులో కే పి హెచ్ బి సిఐ. లక్ష్మీ నారాయణ, స్థానిక కార్పొరేటర్ శ్రీనివాసరావుతో కలిసి మొక్కలు నాటారు . ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ చేసిన సేవలు మరువలేనివని తెలిపారు . యువత కేటీఆర్ స్ఫూర్తిగా తీసుకుని ముందుకు నడవాలన్నారు ఒక ముఖ్యమంత్రి కి కావాల్సిన అన్ని లక్షణాలు కేటీఆర్ కు ఉన్నాయన్నారు,పార్టీని ముందుండి నడిపించడంలో ఆయన ఎవరు సాటిరారు అన్నారు ప్రతిక్షణం రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతూ దేశ రాజకీయాలకు ఆదర్శంగా కేటీఆర్ నిలిచారని,ఆయన ఆదర్శాలను యువ కార్యకర్తలు స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోని అన్ని రాష్ట్రాలను ఆదర్శంగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా కేటీఆర్ చేస్తున్న కృషి ఎనలేనిదని ఆయన అన్నారు,ఈ కార్యక్రమంలో కూకట్పల్లి సర్కిల్ వైద్యాధికారి చంద్రశేఖర్ రెడ్డి, ఎస్ ఆర్ పి సత్యనారాయణ , డివిజన్ గౌరవ అధ్యక్షుడు దామోదర్ రెడ్డి , ఉపాధ్యక్షుడు పోతుల రాజేందర్, కోనేరు ప్రసాద్ , వీరపనేని శ్రీనివాస్ , వేదమూర్తి , భూపాల్ రెడ్డి , ప్రభాకర్ రెడ్డి, రాంప్రసాద్ , వెంకటేష్ యాదవ్ సత్యనారాయణ , కుమార్ స్వామి , అనిల్ కుమార్ సదా మాధవి , స్వప్న విమల, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *