టీఆర్ఎస్ పటిష్టతకు కృషి

పార్టీ అభివృద్ధి కోసం పని చేయాలి

టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు గుడిపాటి సైదులు

తుంగతుర్తి, అక్షిత ప్రతినిధి : మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో నూతన గ్రామ కమిటీని ఏర్పాటు చేసి ప్రతి కార్యకర్త పార్టీ ప్రతిష్టకు కృషి చేయాలని ఉమ్మడి నల్లగొండ జిల్లా డిసిసిబి డైరెక్టర్ మరియు టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు గుడిపాటి సైదులు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆదివారం తుంగతుర్తి మండల పరిధిలోని వెలుగుపల్లి గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ గ్రామ ఎన్నికల పరిశీలకులు పులుసు వెంకట నారాయణ గౌడ్ ,సత్యనారాయణల ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన గ్రామ కమిటీ ఎన్నిక కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తుంగతుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ సూచనల మేరకు టిఆర్ఎస్ పార్టీ గ్రామ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా మల్లెపాక రాములు, ఉపాధ్యక్షులుగా చిట్యాల మల్లయ్య, ప్రధాన కార్యదర్శిగా ఎస్ కే యాకుబ్ ను ఎన్నుకున్నారు. ఈసందర్భంగా నూతన అధ్యక్షులు మల్లెపాక రాములు మాట్లాడుతూ.. గ్రామంలోని ప్రతి కార్యకర్తను సమన్వయం చేసుకుంటూ పార్టీ బలోపేతానికి శాయశక్తులా కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మామిడి వెంకన్న, ఎంపీటీసీ మట్టి పల్లి కవిత, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు నల్లు రాంచంద్రారెడ్డి, ఉప సర్పంచి మోదాల పరమేష్, జిల్లా నాయకులు గుండగాని రాములు గౌడ్, పాటి యాదగిరి రెడ్డి , వెంకన్న, లింగయ్య, శ్రీధర్, గుడిపాటి వీరయ్య మల్లె పాక ముత్తయ్య, యాదగిరి, జలంధర్ వెంకన్నతో పాటు గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *