కార్యకర్తలకు కొండంత అండగా… గులాబీ

గడపగడపకూ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ ఫలాలు
* కార్యకర్తలకు కొండంత అండగా టీఆర్ఎస్ పార్టీ
* శాంతి నగర్, రామచంద్రగూడెం లలో వార్డు కమిటీలు

భాస్కర్ రావు 

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ ఫలాలు గడపగడపకూ చేరుతున్నాయని మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ కొండంత అండగా నిలుస్తుందన్నారు. టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు పట్టణ, మండల, గ్రామస్థాయిల్లో కమిటీల నియామక ప్రక్రియ చురుకుగా నిర్వహిస్తున్నామని అన్నారు. పార్టీ కోసం కష్టపడి, క్రమశిక్షణ, నిబద్ధతతో పనిచేసేవారికి కమిటీల నియామకంలో సముచిత స్థానం కల్పిస్తున్నామని అన్నారు. కమిటీల నియామకంలో సామాజిక న్యాయాన్ని పాటించడంతో పాటు అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేస్తున్నామని అన్నారు. కాగా, ఎమ్మెల్యే భాస్కర్ రావు ఆదేశానుసారం మిర్యాలగూడ పట్టణంలోని 28వ వార్డు- శాంతినగర్, 13వ వార్డు- రామచంద్రగూడెం వార్డ్ లో కమిటీలను ఆదివారం పూర్తి చేశారు. మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, కౌన్సిలర్ సాదెఖా బేగం- ఖాదర్, తిరుమలగిరి స్వర్ణలత-వజ్రం ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ నూతన వార్డు కమిటీ ఎన్నిక జరిగింది. 28వ వార్డు శాంతినగర్ అధ్యక్షులుగా గంగుల బిక్షం, ఉపాధ్యక్షులుగా కీసర శంకర్, ప్రధాన కార్యదర్శిగా ఆరీఫ్ ను ఎంపిక చేసినట్టు తెలిపారు. వార్డు అధ్యక్ష కార్యదర్శులతో పాటు యూత్ కమిటీ, బీసీ సెల్ , ఎస్సీ సెల్, ఎస్టీ సెల్, రైతు విభాగం, మైనారిటీ సెల్ మహిళ కమిటీ, కార్మిక విభాగం కమిటీలను పూర్తి చేశామన్నారు. 13వ వార్డు- రామచంద్రగూడెం వార్డు అధ్యక్షులుగా వెన్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా పాశం యాదగిరి, మహిళా అధ్యక్షురాలిగా గడ్డం వనజ , ఉపాధ్యక్షులుగా కందిమల్ల మంగమ్మ, యువజన అధ్యక్షులుగా మదినేని నాగార్జున, ఉపాధ్యక్షులుగా తిరుమల కిరణ్, బీసీ విభాగం అధ్యక్షులుగా భద్రం రాజు, శ్రీరాములు ఉపాధ్యక్షులుగా తిరుమలగిరి ప్రసాద్, రైతు విభాగం అధ్యక్షులుగా దాసరాజు అంజన్ రావు, కార్మిక విభాగం అధ్యక్షులుగా కోరాటపాపారావును నియమించారు. ఈ కార్యక్రమంలో గంధం కృష్ణ, నాగేందర్, జహీర్, జాని, కీసర శ్రీను, బ్రహ్మ చారి, షరీఫ్,రాజశేఖర్,ఫాయాస్, తాహిర్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *