టీఆర్ఎస్ వెన్నంటే మైనారిటీలు

బాపూజీ నగర్ లో మసీదు ప్రారంభించిన నల్లమోతు సిద్దార్ధ 

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి : టీఆర్ఎస్ వెన్నంటే మైనారిటీలు జీవితాంతం ఉంటారని ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్, యువనేత నల్లమోతు సిద్దార్ధ తెలిపారు. మిర్యాలగూడ పట్టణంలోని బాపూజీ నగర్ లో నూతనంగా నిర్మించిన మసీదును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నల్లమోతు సిద్దార్ధ మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రానికి రక్షణ కవచం లాంటిదని అన్నారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మైనారిటీలకు రాజకీయంగా, సామాజికంగా, ఆర్ధికంగా తగిన గుర్తింపును ఇచ్చారని అన్నారు. మైనారిటీల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మసీదుల్లో సేవలందిస్తున్న 10వేల మంది ఇమామ్ లకు, మౌజమ్ లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెలా రూ.5వేలు చొప్పున గౌరవ వేతనం చెల్లిస్తున్నదని అన్నారు. నిరుపేద ముస్లిం యువతుల పెండ్లి భారం కావొద్దనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం షాదీ ముబారక్ పథకం ద్వారా రూ.1,00,116 ఆర్ధిక సాయం అందిస్తోందన్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా 2020-21 రాష్ట్ర బడ్జెట్ లో మైనారిటీల సంక్షేమం కోసం ప్రభుత్వం రూ.1,518 కోట్లు, 2021-22 బడ్జెట్ లో రూ.1,606 కోట్లు కేటాయించిందన్నారు. మైనారిటీల కోసం 204 గురుకులాలను ఏర్పాటు చేసిందన్నారు. మైనారిటీల భద్రత, అభ్యున్నతి, సంక్షేమం కోసం అంకితభావంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా ప్రతి ఏడాది ముస్లిం సోదరసోదరీమణులకు ప్రభుత్వం రంజాన్ తోఫాలు అందజేస్తోందన్నారు. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా డ్రైవర్ కం ఓనర్ స్కీం ద్వారా లబ్ధిదారులకు ప్రభుత్వం మారుతీ కార్లను అందజేస్తున్నదని అన్నారు. నిరుద్యోగ యువత ఆర్ధికంగా నిలదొక్కుకునేందుకు, వారి కుటుంబ జీవన పరిస్థితులు మెరుగయ్యేందుకు ఈ పథకం దోహదం చేస్తున్నదని అన్నారు. ఓవర్సీస్ పథకం ద్వారా మైనారిటీలు ఉన్నత విద్యనభ్యసించేందుకు ప్రభుత్వం ఆర్ధిక సాయం అందిస్తోందన్నారు. మైనారిటీ విద్యార్థులకు ఉపకార వేతనాలను అందజేస్తూ ప్రోత్సహిస్తున్నదని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరిస్తున్న విధానాల కారణంగా తెలంగాణ రాష్ట్రంలో మత సామరస్యం వెల్లివిరుస్తున్నదని నల్లమోతు సిద్దార్ధ తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, వింజమ్ శ్రీధర్, మాజీ కౌన్సిలర్ రాజు, నాయకులు పిన్నబోయిన శ్రీనివాస్ యాదవ్, మత పెద్దలు, మైనారిటీ నాయకులు, బీసీ సంక్షేమ సంఘం నాయకులు , తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *