కార్యకర్తలే టీఆర్ఎస్ కు పునాదులు

ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్ ) పార్టీకి కార్యకర్తలే పునాదులని మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు తెలిపారు.కార్యకర్తలందరినీ తమ పార్టీ కంటికి రెప్పలా కాపాడుకుంటున్నదని ఆయన భరోసా ఇచ్చారు.మిర్యాలగూడ మండలంలోని రాయిని పాలెం గ్రామపంచాయతీ టీఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులుగా పరంగి రంజిత్, ప్రధాన కార్యదర్శిగా ఉల్లెందుల వెంకన్న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరితో పాటు గ్రామ రైతు విభాగం అధ్యక్షులుగా కొన్రెడ్డి గోవర్ధన్ రెడ్డి, కార్మిక విభాగం అధ్యక్షులుగా పోలగాని శ్రీను,యూత్ అధ్యక్షులుగా చిలకల వీరబాబు, ఎస్సీ సెల్ అధ్యక్షులుగా రామ్ లక్ష్మయ్య, మహిళా అధ్యక్షురాలుగా కాకునూరి సైదమ్మ, బీసీ సెల్ అధ్యక్షులుగా చిమట రవి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులంతా క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే భాస్కర్ రావును మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా భాస్కర్ రావు మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు మిర్యాలగూడ నియోజకవర్గంలో పట్టణ, మండల, వార్డుల కమిటీ ఎన్నిక జోరుగా కొనసాగుతున్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ ఫలాలు గడపగడపకూ చేరుతున్నాయని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ కొండంత అండగా నిలుస్తుందన్నారు. పార్టీ కోసం కష్టపడి, క్రమశిక్షణ, నిబద్ధతతో పనిచేసేవారికి కమిటీల నియామకంలో సముచిత స్థానం కల్పిస్తున్నామని అన్నారు. కమిటీల నియామకంలో సామాజిక న్యాయాన్ని పాటించడంతో పాటు అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేస్తున్నామని భాస్కర్ రావు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *