హరితహారంతో అందరికి మేలు: ఏఈ చంద్రమౌళి

అక్షిత న్యూస్, పర్వతగిరి: తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి కార్యక్రమాల్లో హరితాహారం ప్రతిష్టాత్మకమైన కార్యక్రమమని పర్వతగిరి విద్యుత్ సబ్ డివిజన్ అధికారి చంద్రమౌళి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్ లో విద్యుత్ సిబ్బందితో కలిసి 150 మొక్కలు నాటి హరితహారం కార్యక్రమం నిర్వహించారు. హరితహరంతో పచ్చదనం ఏర్పడుతుందని, ప్రతి ఇంటికి పది మొక్కలు నాటి హరితాహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ అయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎనుగల్లు లైన్ ఇన్స్పెక్టర్ రమేష్ కుమార్, పర్వతగిరి లైన్ మెన్ హరి, శ్రీకాంత్, దామోదర్, మోహన్, రమేష్, బీక్య, బద్రు తదితర విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *