పెరటి తోటల పెంపకంపై శిక్షణ

12 రకాల కూరగాయల విత్తనాలు పంపిణీ

మహబూబ్ నగర్, అక్షిత బ్యూరో : నాగర్ కర్నూల్ జిల్లా లోని కోనేరు సంస్థ ఆధ్వర్యంలో అమ్రాబాద్ మండల కేంద్రంలో చెంచులకు పెరటి తోటల పై శిక్షణా కార్యక్రమం మంగళవారం ఏర్పాటు చేయడం జరిగింది . రిసోర్స్ పర్సన్ కృషి విజ్ఞాన కేంద్రం, పాలెం నుండి వచ్చిన న్యూట్రిషన్ సైంటిస్ట్ అసిఫా జహాన్ శిక్షణ ఇస్తూ పెరటి తోటల పెంపకం మరియు యాజమాన్య పద్ధతులపై శిక్షణ ఇస్తూ ఇంటి పరిసరాలలో నీటిని వృదా గా పోనీయకుండా ఆ నీటిని తోటలకు మళ్ళించి,ఇంటికి అవసరమైన కూరగాయలను పండిచుకొని తాజా కూరగాయలను తినాలని,వారానికి కనీసం రెండు సార్లు ఆకుకూరలను తినాలని..దాని ద్వారా రక్తహీనతను నివారించవచ్చని అన్నారు…పూర్వీకులు తినే ఆహారం ఆరోగ్యానికి చాలా మంచిదని కావున అటువంటి ఆహారాన్ని మనం అలవాటు చేసుకోవాలని అన్నారు ..విదేశీయుల అలవాట్లను మనం పాటిస్తున్నామని అందుకే అనేక వ్యాధుల భారిన పడుతున్నాని.. కావున పెరట్లో తోటలను పెంచుకునేటప్పుడు ఒక క్రమపద్దతిలో వారిని పెంచుకోవాలని అన్నారు..అనంతరం వారికి 12 రకాల కూరగాయల విత్తనాలను పంపిణీ చేశారు.. ఈ కార్యక్రమంలో కోనేరు సంస్థ సిబ్బంది పెద్దులు, సురేష్ గౌడ్,ఇస్మాయిల్,శ్రావణి, లింగేశ్వర్ పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *