తప్పుడు మార్గంలో వాహనాలు నడపొద్దు

ట్రాఫిక్ నిబంధనలు, భద్రత నియమాలు పాటించాలి

సూర్యాపేట,అక్షిత బ్యూరో :పట్టణంలో జాతీయ రహదారిపై కొత్త వ్యవసాయ మార్కెట్ చౌరస్తా నుండి అంజనాపూరి కాలనీ చౌరస్తా వరకు గల సర్వీస్ రోడ్డు పై ఆంక్షలను కఠినతరం చేయడం జరిగిందని ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఏ.ఆంజనేయులు తెలిపారు. ప్రజల సౌకర్యార్థం ఫ్లై ఓవర్ కు అండర్ పాస్ లను ఏర్పాటు చేశారన్నారు ఈ అండర్ పాస్ ల ద్వారా రాకపోకలు చేయాలని కోరారు. ఈ సర్వీస్ రోడ్డుపై వాహనదారులు, ప్రజలు ఆపోజిట్ డైరక్షన్ (ఎదురు మార్గం/తప్పుడు మార్గం) లో వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం జరుగుతుందని కావున పట్టణ, పట్టణ పరిసర ప్రాంత ప్రజలు ఇట్టి ఆంక్షలను గమనించి తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎవ్వరు కూడా వాహనాలను తప్పుడు మార్గంలో నడపవద్దన్నారు. ఇతరులకు ఇబ్బంది కలగకుండా బాధ్యతగా నడుచుకోవాలన్నారు. ప్రజలు వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు, భద్రత నియమాలు పాటించి ప్రమాదాల బారిన పడకుండా ఉండాలన్నారు. ఈ మార్గం నిఘా కెమెరాల పర్యవేక్షణలో ఉన్నదని నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు విధించబడును మరియు వాహనాలు సీజ్ చేయడం జరుగుతుందన్నారు.

ప్రజల రక్షణ దృష్ట్యా ఆంక్షలను అమలు చేస్తున్నామని కావున ప్రజలు, వాహనదారులు అందరూ పోలీసు వారికి సహకరించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *