నోరు అదుపులో పెట్టుకో…

మంత్రి మల్లారెడ్డిపై కాంగ్రెస్ నేతల ధ్వజం
వేములపల్లి, అక్షిత ప్రతినిధి : పిసిసి రథసారథి, ఎంపి రేవంత్ రెడ్డిపై మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యలు తగదని వేములపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మాలి కాంతారెడ్డి అన్నారు. నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని, లేకుంటే తీవ్ర పరిణామాలు చవి చూడాల్సివస్తుందన్నారు. శుక్రవారం వేములపల్లి మండల కేంద్రంలో మీడియాతో మాట్లాడుతూ మీ భూముల చిట్టా అంతా రేవంత్ వద్ద ఉందని, ఇక విప్పడం తథ్యమన్నారు. మేడ్చెల్ జిల్లా ముడుచింతలపల్లి లో నిర్వహించిన దళిత గిరిజన ఆత్మ గౌరవ దీక్షలో మంత్రి మాల్లారెడ్డి భూకబ్జా చేశారని నిర్ధిష్ట ఆరోపణ చేస్తే నిరూపణ చేయలేక, టిఆర్ఎస్ మేడ్చల్ ఎమ్మెల్యే క్యాబినెట్ మంత్రిగా ఉండి అసలు మంత్రి అనే సోయి కూడా లేకుండా వ్యవహరించడం సిగ్గు చేటన్నారు. పిచ్చాసుపత్రి నుంచి పారిపోయిన పిచ్చోడిలాగా, నోరు అదుపులో లేకుండా అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా, వీధి రౌడీలా తొడలు కొట్టి సవాల్ చేయడం సిగ్గుచేటన్నారు. ఒక జాతీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు అనుముల రేవంత్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం.. వాటిని తీవ్రంగా ఖండిస్తూ మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో నోరు అదుపులో లేకుండా మాట్లాడితే సరైన బుద్ధి చెప్తామని, టిఆర్ఎస్ పార్టీ వాళ్ళకి హెచ్చరిస్తూ మతిభ్రమించిన మాటలు మానుకోవాలని
లేకపోతే రానున్న రోజుల్లో రోడ్ల పైన కనబడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సరైన గుణపాఠం చెబుతారన్నారని హెచ్చరించారు.అలాగే అక్రమంగా మీ బంధువుల పేరుపై ఉన్న ప్రభుత్వ భూములను చూపించి యూనివర్సిటీకి తెచ్చుకున్నారని, అలాగే మెడికల్ కళాశాల ఆసుపత్రి నిర్మించింది.. ప్రభుత్వ భూమి అని సీఎం కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే వెంటనే ప్రభుత్వ భూమిని.. ప్రభుత్వం స్వాధీనం చేసుకొని అక్రమాలకు పాల్పడ్డ మల్లారెడ్డి కుటుంబ సభ్యులపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు పుట్టల కృపయ్య, కల్లు శ్రీను, ఎన్ఎస్ యూ ఐ రాష్ట్ర నాయకులు బొంగర్ల వినోద్, యూత్ కాంగ్రెస్ నాయకులు దైద గిరి, ఎండి మహిమూద్, మాతంగి చంటి, తర్రి రాకేష్, పుట్టల సుమంత్, దైద యోహాన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *