కమ్మనైన భాష అమ్మ భాష

తేనే వంటి తీయనైన భాష …తెలుగు

తేనే వంటి తీయనైన భాష తెలుగు.  అమ్మ పాల కమ్మనైన భాష. తెలుగు. విజయనగర సామ్రాజ్య దీషుడు శ్రీకృష్ణదేవరాయలచే దేశభాషలందు తెలుగు లెస్స అని కీర్తించబడిన భాష ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ గా ప్రాచుర్యం పొందిన భాష భారత దేశంలో హిందీ తర్వాత అతిపెద్ద భాష తెలుగు. దేశంలో రెండు రాష్ట్రాల్లో దాదాపు 15 కోట్ల మంది ఉన్నారు. చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే కోటి పూలు తేవే అని తెలుగు వాగ్గేయకారుడు రాసిన పాట పల్లవించనీ తెలుగు లోగిలి ఉండదేమో. గోరు ముద్దుల ప్రాయంలో అమ్మ పాడే ఈ పాట బిడ్డ మోమున నవ్వులు పూయిస్తుంది. 2000 సంవత్సరాల ఘన చరిత్ర ఉన్న భాష నేడు వెల వెల బోయింది. తెలుగు నాట నేడు గేయాలు స్థానంలో ఇంగ్లీష్ పాటలు వినబడుతున్నాయి.
*తెలుగు భాషా వైతాళికుడు గిడుగు రామ్మూర్తి పంతులు*
వ్యవహారిక భాషా పితామహుడిగా పేరొందిన గిడుగు రామ్మూర్తి పంతులు తెలుగు భాషా వైభవానికి పునాదులు వేసిన మహనీయుడు. గ్రాంధికభాషలో పండితులకు మాత్రమే అర్థం అయ్యేలా ఉన్న తెలుగు భాష మాధుర్యాన్ని ప్రజలందరికీ అందేలా కృషి చేశారు. తెలుగు వచనాన్ని ప్రజల వాడుకభాషలోకి తీసుకు వచ్చారు .శిష్టవ్యావహారికం పేరిట..వాడుక భాషలో బోధనకు ఆయన పెద్దపీట వేశారు. తెలుగు పదాలోని భావాన్ని స్పష్టతను పామరులకు సైతం అర్థమయ్యేలా తెలియజెప్పిన మహనీయుడు. బహుభాషా శాస్త్రవేత్త చరిత్రకారుడు సంఘసంస్కర్త హేతువాది ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవం గా నిర్వహిస్తారు.
*తెలుగు భాష పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు* *తెలుగు భాష అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలి.
*తెలుగు భాషలో ఉన్నతస్థాయి కోర్సులు అభ్యసించే విద్యార్థులకు మాతృభాషలో పుస్తకాలు అందేలా చూడాలి.
* తెలుగు భాషకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి.
* పోటీ పరీక్షల్లో తెలుగు భాషను ప్రత్యేక సబ్జెక్టుగా ప్రవేశపెట్టాలి.
* తెలుగు మాధ్యమంలో చదివిన అభ్యర్థులకు 5 శాతం రిజర్వేషన్ కల్పించాలి. *ప్రభుత్వ కార్యాలయాల్లో ఉత్తరప్రత్యుత్తరాలు తెలుగులో జరిగేలా పటిష్టమైన చర్యలు తీసుకోవాలి.
*వ్యక్తిగత అభిప్రాయం* అమ్మదనం నిండిన కమ్మనైన భాష తెలుగు ను నేటి తరానికి అందించాలి.మాతృ భాషలోని మాధుర్యాన్ని విశ్లేషించి చెప్పాలే. పాఠశాల విద్యార్థులకు పాఠశాల స్థాయి నుండే మాతృభాష పట్ల మమకారాన్ని పెంచాలి. విద్యార్థులకు భాష పట్ల అభిరుచిని పెంపొందించటం ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకోవాలి .పాఠశాలల్లో భాషా దినోత్సవాలు నిర్వహించాలి.కవుల జయంతి జయంతి వర్ధంతులను ప్రభుత్వం నిర్వహించి వారి గొప్ప గొప్ప దనాన్ని తెలియజేయాలి. తెలుగు భాష బోధకులకు పదోన్నతులు కల్పించాలి. తెలుగు భాషా సాహిత్యాల అభివృద్ధికి కృషిచేసినవారిని ప్రతియేటా సత్కరించాలి .తెలుగు పాఠ్యాంశాలను రూపొందించిన కవులు రచయితలతో సదస్సులు సమావేశాలు ఏర్పాటు చేయాలి.

    రాపోలు పరమేష్                 

ప్రధాన కార్యదర్శి, సాహితీ కౌముది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *