తెలంగాణలో యాదవులకు పెద్దపీట

గొర్రెల యూనిట్ల పెంపు పట్ల సిఎం కెసిఆర్, మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం*

సూర్యాపేట, అక్షిత బ్యూరో:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ రాష్ట్రంలో యాదవులకు పెద్దపీట వేస్తూ వారి సంక్షేమం, అభివృద్ధికి పాటుపడుతున్నారని జిల్లా గొర్రెల మేకల పెంపకందారుల సహకార సంఘం చైర్మన్ పోలెబోయిన నర్సయ్యయాదవ్, ప్రముఖ వైద్యులు డాక్టర్ రామ్మూర్తి యాదవ్ లు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల యూనిట్లను లక్ష 25 వేల నుంచి లక్షా 75వేలకు పెంచడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బుధవారం స్థానిక తెలంగాణ తల్లి విగ్రహం వద్ద సీఎం కేసీఆర్ మంత్రులు తలసాని శ్రీనివాస్ యదవ్, కేటీఆర్, జగదీష్ రెడ్డిల చిత్ర పటాలకు పాలాభిషేకం నిర్వహించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు నుంచి యాదవ్లకు సముచిత స్థానం కల్పిస్తుందన్నారు. చట్టసభల్లో యాదవులకి అయిదు ఎమ్మెల్యే సీట్లు కేటాయించడంతో పాటు ఎమ్మెల్సీ, ఎంపీ స్థానం కేటాయించడం హర్షణీయమన్నారు. యాదవుల సంక్షేమం అభివృద్ధికి పాటుపడుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి యాదవులంతా మద్దతు తెలుపుతారన్నారు. ఒక్క యాదవుల సంక్షేమమే కాకుండా రాష్ట్రంలోని అన్ని కులాలకు సమాన స్థాయిలో అభివృద్ధి చేస్తున్న ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే దక్కిందన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సీఎం కేసీఆర్కు యాదవులంతా అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దగట్టు ఆలయ కమిటీ చైర్మన్ కోడి సైదులు, యాదవ ప్రముఖులు బడుగుల శ్రీనివాస్‌ యాదవ్, జటంగి సైదులు, బోలక వెంకట్, బొడ్డు కిరణ్, న్యాయవాది మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *