తెలంగాణ పోలీస్ వ్యవస్థ భేష్

* ఎన్బీఆర్ ఫౌండేషన్ సేవలు అనిర్వచనీయం
* ఎస్సై, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించాలనే ఔత్సాహిక యువతకు ఉచిత శిక్షణ అభినందనీయం
* మిర్యాలగూడ డీఎస్పీ వెంకటేశ్వర రావు 

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి : దేశంలోనే తెలంగాణ పోలీస్ వ్యవస్థ భేష్ అని మిర్యాలగూడ డీఎస్పీ వెంకటేశ్వర రావు కొనియాడారు. పోలీసింగ్ అంటేనే సవాళ్ళతో కూడుకున్నదని, ఉన్నత ఆశయాలతో యువత పోలీస్ కొలువులను సాధించాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నారని అన్నారు. మిర్యాలగూడ పట్టణంలోని శ్రీచైతన్య డిగ్రీ కళాశాలలో ఎన్బీఆర్ ఫౌండేషన్, మిర్యాలగూడ సబ్ డివిజన్ పోలీసులు సంయుక్తంగా ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల ఉచిత శిక్షణకు అర్హత పరీక్షను శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఎస్పీ వెంకటేశ్వర రావు హాజరై ప్రశ్నపత్రాన్ని విడుదల చేశారు. అనంతరం అభ్యర్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్దార్ధ సామాజిక బాధ్యతగా అనేక సేవా కార్యక్రమాలను నిర్వర్తిస్తున్నారని అభినందించారు. పోలీస్ శాఖలో ఉద్యోగాలను సాధించాలనే యువతలో ప్రతిభావంతులను గుర్తించి ఉచిత శిక్షణ అందజేసి వారంతా జీవితంలో స్థిరపడే సదవకాశాన్ని కల్పిస్తున్నారని, ఆయన సేవలు అనిర్వచనీయమని ప్రశంసనీయమని అన్నారు. ఎన్బీఆర్ ఫౌండేషన్ సాయంతో ఉచిత శిక్షణ పొందినవారిలో అనేక మంది పోలీస్ శాఖలో ఉద్యోగాలు సాధించి స్థిరపడ్డారని అన్నారు.

అర్హత పరీక్షకు హాజరైనవారంతా ఉచిత శిక్షణకు అర్హత సాధించాలని ఆకాంక్షిస్తున్నట్టు డీఎస్పీ తెలిపారు. కాగా, ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల్లో శిక్షణ కోసం నిర్వహించిన అర్హత పరీక్షకు 722 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 629 మంది విద్యార్థులు హాజరైనట్టు నిర్వాహకులు నల్లమోతు సిద్దార్ధ పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాన్ని పర్యవేక్షించిన పోలీస్ అధికారులకు, సహకరించిన సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్లమోతు సాంబశివరావు, టీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి షోయబ్, కోటేశ్వర్ రావు, ఎన్బీఆర్ ఫౌండేషన్ సభ్యులు, పరీక్ష అబ్జర్వర్లు, కళాశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *