ఉపాధ్యాయులు నవసమాజ నిర్మాతలు

* డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా నివాళి అర్పించిన భాస్కర్ రావు

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి : ఉపాధ్యాయులు నవసమాజ నిర్మాతలని మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు తెలిపారు. భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా స్థానిక అమరవీరుల స్థూపం వద్ద టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో భాస్కర్ రావు పాల్గొన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించి నివాళి అర్పించారు. అనంతరం భాస్కర్ రావు మాట్లాడారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా నిర్వహించే ఉపాధ్యాయ దినోత్సవం (సెప్టెంబర్ 5) సందర్భంగా ఉపాధ్యాయులకు భాస్కర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. భావి భారత పౌరులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైందని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు దిశా నిర్ధేశకులు ఉపాధ్యాయులేనని అభివర్ణించారు. విద్య నేర్పిన గురువులను పూజించే గొప్ప సంస్కృతి భారతదేశంలో ఉందన్నారు. అధ్యాపక వృత్తికే వన్నెతెచ్చి అత్యున్నతమైన రాష్టప్రతి పదవిని అలంకరించిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితం ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని, ఆయన బోధనలు అనునిత్యం అనుసరణీయమని పేర్కొన్నారు. మహనీయుడు అబ్దుల్ కలాం చెప్పినట్టు విద్యార్థుల్లో మంచి లక్షణాలను పెంపొందించడానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కీలకమన్నారు. రాష్ట్రంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని అన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ రచించిన ‘ఇండియన్ ఫిలాసఫీ’ పుస్తకం ప్రపంచ వ్యాప్తంగా విశేష గుర్తింపు పొందిందన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ దుర్గంపూడి నారాయణ రెడ్డి, మారం శ్రీనివాస్, మురళీ యాదవ్, రాపోలు పరమేష్, కోడిరెక్క సురేష్, నజీర్, నగేష్, సంతోష్, శివ, చారి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *