సమాజ అభివృద్ధిలో ఉపాధ్యాయులు జర్నలిస్టుల సేవలు మరువలేనివి

  • సమాజ అభివృద్ధిలో ఉపాధ్యాయులు జర్నలిస్టుల సేవలు మరువలేనివి
  • వాసవి వనిత క్లబ్ అధ్యక్షురాలు తోట కమల
  • శ్రీ భగవద్గీత మందిరం లో ఉపాధ్యాయులకు, జర్నలిస్టుల కు సన్మానం

సూర్యాపేట, అక్షిత బ్యూరో: సమాజ అభివృద్ధి లో ఉపాధ్యాయులు, జర్నలిస్టుల సేవలు మరువ లేనివి అని వాసవి వనిత క్లబ్ అధ్యక్షురాలు తోట కమల అన్నారు.ఆదివారము ఉపాధ్యాయుల దినోత్సవం ను పురస్కరించుకుని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ భగవద్గీత మందిరం లో ఉపాధ్యాయులతో పాటు జర్నలిస్టుల ను సన్మానించారు.ఈ సందర్భముగా వారు మాట్లాడుతూ అన్నదానం ఆకలితిరుస్తుందని ,అక్షర జ్ఞానము అజ్ఞానాన్ని తొలగిస్తుందని అన్నారు.అలాంటి అక్షరజ్ఞాన వృత్తి ని ఎన్నుకున్న ఉపాధ్యాయులు అభినందనియులని అన్నారు. జర్నలిస్టులు ప్రభుత్వానికి ప్రజల మధ్య వారధిగా ఉంటూ ప్రభుత్వం చేపడుతున్న ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు పత్రికల ద్వారా చేరవేస్తున్న జర్నలిస్టుల వృత్తి కూడా ఎంతో ఉన్నతమైందని అన్నారు. ఈ సందర్భముగా పలువురు ఉపాధ్యాయులు, జర్నలిస్టుల ను సన్మానించారు.ఈ కార్యక్రమ0 లో వాసవియన్స్ సింగిరికొండ రవీందర్,తోట శ్యామ్ ప్రసాద్, రుద్ర0గి రవిశశి,గుండాశ్రీధర్, బిక్కుమళ్ళ నాగేశ్వరరావు, వెంపటి శబరి, బిక్కుమళ్ళ జ్యోతి,గుండా ఉపేందర్, తల్లాడసోమయ్య, బిక్కుమళ్ళ కృష్ణ,మిర్యాల సుదాకర్, కొత్త రామనర్సయ్య,గుండా సుదామాధురి, బ్రహ్మదేవర సరస్వతి, ఉపాధ్యాయులు, జర్నలిస్టులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *