టీచర్ల సమస్యల పరిష్కారానికి కృషి

* కరోనా విపత్కర పరిస్థితుల్లో దెబ్బతిన్న విద్యా రంగం
* పీఆర్టీయూ డివిజన్ కార్యాలయానికి స్థలం మంజూరుకు భాస్కర్ రావు భరోసా
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :టీచర్ల సమస్యల పరిష్కారానికి తన వంతుగా కృషి చేయనున్నట్టు మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు తెలిపారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో విద్యారంగం బాగా దెబ్బతిన్నదని అన్నారు. మిర్యాలగూడ పట్టణంలోని బకాల్ వాడీ, అభ్యాస్ టెక్నో స్కూల్స్ లో అడవిదేవులపల్లి, మిర్యాలగూడ మండలాల పీఆర్టీయూ (ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్) సర్వసభ్య సమావేశాలను గురువారం నిర్వహించారు. ఆయా సమావేశాల్లో ముఖ్య అతిథిగా నల్లమోతు భాస్కర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక వసతులను కల్పించడంతో పాటు మెరుగైన విద్యా ప్రమాణాలను పెంపొందించడంతో డ్రాపవుట్స్ క్రమంగా తగ్గాయని అన్నారు. పీఆర్టీయూ మిర్యాలగూడ డివిజన్ కార్యాలయ భవనానికి స్థలం మంజూరు చేయనున్నట్టు భాస్కర్ రావు భరోసా ఇచ్చారు. అనంతరం అడవిదేవులపల్లి మండల పీఆర్టీయూ అధ్యక్ష, కార్యదర్శులుగా అంబటి శ్రీనివాస్, ఫకీరా, మిర్యాలగూడ మండల పీఆర్టీయూ అధ్యక్ష, కార్యదర్శులుగా రాయికంటి సైదులు, పల్ రెడ్డి యుగేందర్ రెడ్డిని కార్యవర్గ కమిటీ సభ్యులు ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్ష, కార్యదర్శులను భాస్కర్ రావు అభినందించారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్, జిల్లా పీఆర్టీయూ అధ్యక్షులు సుంకరి భిక్షం గౌడ్, ప్రధాన కార్యదర్శి ముదిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎంఈవో బాలాజీ నాయక్, పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు మామిళ్ల శ్రీనివాస్ రెడ్డి, పీఆర్టీయూ నాయకులు నర్సింహా నాయక్,లక్ష్మణ్ నాయక్, గోపి, యాదగిరి రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *