సూర్యాపేట ప్రగతికి స్వామి నారాయణ తలమానికం

*సమాజ నిర్మాణంలో స్వామి నారాయణ్ గురుకుల్ ట్రస్ట్ పోషిస్తున్న పాత్ర అద్భుతం*

*సూర్యాపేటలో విద్యా వికాస అభివృద్ధి కోసం స్వామి నారాయణ్ గురుకుల్ పాఠశాలను తీసుకురావడం సంతోషకరం*

*దేశ వ్యాప్తంగా పాఠశాలల నిర్వహణతో గురుకుల్ ట్రస్ట్ వేలాది మంది విద్యార్థులకు విద్యనందిస్తూ మంచి సమాజ నిర్మాణంలో పోషిస్తున్న పాత్ర అద్భుతం*

*ఇక్కడ విద్యానభ్యసించే విద్యార్థులు తమ జీవితాన్ని క్రమ పద్దతి లో నిర్మాణం చేసుకుంటారనడం లో ఎలాంటి సందేహం లేదు*

*సూర్యాపేట అభివృద్ధికి స్వామి నారాయన్ గురుకుల్ పాఠశాల తలమానికం 

సూర్యాపేట నియోజకవర్గం చివ్వేంల మండలం ఉండ్రుగొండ వద్ద శ్రీ స్వామి నారాయణ్ అంతర్జాతీయ గురుకుల్ పాఠశాల నిర్మాణానికి భూమి పూజ చేసిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి

సూర్యాపేట, అక్షిత బ్యూరో : సూర్యాపేట ప్రగతికి స్వామి నారాయణ గురుకుల్ తలమానికంగా నిలువనుంది. విద్యారంగంలో విశ్వ ఖ్యాతి గడించిన స్వామి నారాయణ గురుకుల్ సూర్యాపేటకు మంచి కీర్తిని తెచ్చి పెడుతుంది. విద్యారంగంలో విప్లవాత్మకమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టి… విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు దర్పణంగా నిలుస్తోంది. సూర్యాపేట సమీపంలో స్వామి నారాయణ్ గురుకుల్ ట్రస్ట్ అంతర్జాతీయ పాఠశాలను ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం సంతోష దాయకమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.చివ్వేంల మండలం ఉండ్రుగొండ వద్ద 65 వ నంబర్ జాతీయ రహదారి పై 15 ఎకరాల్లో నిర్మిస్తున్న స్వామి నారాయణ్ గురుకుల్ పాఠ శాల భవనాలకు ట్రస్ట్ సభ్యులు ,నేతలతో కలిసి మంత్రి భూమి పూజ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సూర్యాపేట అభివృద్ధికి స్వామి నారాయణ్ గురుకుల్ తలమానికం కావాలని ఆకాంక్షించారు. దేశ వ్యాప్తంగా అంతర్జాతీయ ప్రమాణాలతో గురుకుల్ పాఠశాలలను నిర్వహిస్తూ వేలాది మంది విద్యార్థులకు విద్య నందిస్తూ మంచి సమాజ నిర్మాణంలో స్వామి నారాయణ ట్రస్ట్ అద్బుతమైన పాత్ర పోషిస్తుందని మంత్రి కొనియాడారు.ఇక్కడ విద్య నభ్యసించే విద్యార్థులు తమ జీవితాన్ని క్రమ పద్దతి లో నిర్మాణం చేసుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు.స్వామి నారాయణ్ గురుకుల్ ను ఇక్కడి తీసుకురావడంలో తమ వంతు గా కృషి చేసిన అపూర్వ డేవలపర్స్ వారికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.వచ్చే విద్యా సంవత్సరం నుండి తరగతులు నిర్వహించాలని ముందుకు సాగుతున్న స్వామి నారాయణ్ గురుకుల్ ట్రస్ట్ వారికి అన్నీ రకాలుగా సహాయ సహకారాలు అందజేస్తామని మంత్రి తెలిపారు.కార్యక్రమంలో ఎంపీ బడుగుల, మాజీ జి.హెచ్.ఎం.సి మేయర్ బొంతు రామ్మోహన్ , జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గోపాగాని వెంకట్ నారాయణ గౌడ్, గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, చివ్వేంల ఎంపీపీ కుమారి ,వైస్ ఎంపీపీ జీవన్ రెడ్డి, జడ్పిటిసి సంజీవ్ నాయక్, ఇతర ప్రజా ప్రతినిధులు ,స్వామి నారాయణ్ గురుకుల్ ట్రస్ట్ యాజమాన్యం, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *