స్వరాష్ట్ర స్వాప్నికుడు… జయశంకర్

ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఆచార్య జయశంకర్ పాత్ర కీలకం
* మిర్యాలగూడ డివిజన్ విద్యుత్ కార్యాలయంలో ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలు
* ప్రొఫెసర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించిన డీఈ వెంకట కృష్ణయ్య 

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఆచార్య జయశంకర్ పాత్ర కీలకమని మిర్యాలగూడ డివిజనల్ విద్యుత్ ఇంజినీర్ వెంకట కిష్టయ్య తెలిపారు. మిర్యాలగూడ డివిజన్ విద్యుత్ కార్యాలయంలో డీఈ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ చిత్ర పటానికి డీఈ వెంకట కృష్ణయ్య పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించి నివాళులు అర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆచార్య జయశంకర్ నిర్వర్తించిన పాత్రను డీఈ వెంకట కృష్ణయ్య వివరించారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఆయన తన తుది శ్వాస వరకు యువతను, విద్యార్థులను చైతన్యపరిచారని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆచార్య జయశంకర్ ఆశయ సాధన కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు, విద్యుత్ ఉద్యోగులు, కార్మిక సంఘాల నాయకులు పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో ఏడీఈ సూర్యా నాయక్, సక్రు నాయక్, కుమారి, మారం శ్రీనివాస్, నిఖిత, ఆంజనేయులు, విజయ్ కుమార్, రామ్ చందర్, సైదులు, శ్రీనివాస్, పాండు , కృష్ణారెడ్డి, వెంకటయ్య, శ్రీనివాస్, ఇమ్రాన్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *