సుందరయ్య నగర్ పేదలకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలి.. సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి డిమాండ్

సూర్యాపేట, అక్షిత బ్యూరో: పట్టణంలోని సుందరయ్య నగర్ లో గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్న పేదలందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో జిల్లా అదనపు కలెక్టర్ ఎస్ మోహన్ రావు కు వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15 సంవత్సరాల క్రితం ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకుని నివాసముంటున్న పేదల సమస్యలు ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. ఇళ్ల పట్టాలు ఇవ్వాలని అనేకసార్లు జిల్లా మండల అధికారులకు ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు ఇచ్చిన ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.ప్రజా ప్రతినిధులు మారుతున్న అధికారులు మారుతున్న పేదల సమస్యలు మాత్రం మారడంలేదన్నారు. ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇవ్వకపోగా గుడిసె వేసుకుని నివాసం ఉంటే పట్టా కూడా ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. పేదలను చులకనగా చూస్తున్న ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెబుతామన్నారు. జిల్లా కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకుని అర్హులను గుర్తించి ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ములకలపల్లి రాములు సిపిఎం టూ టౌన్ కార్యదర్శి కోట గోపి,సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు దండా వెంకట రెడ్డి,నాయకులు వీరబోయిన రవి, పట్టణ నాయకులు బత్తుల వెంకన్న, సాయి కుమార్,మొకర్ల వెంకన్న,జహంగీర్, ల్రామతార, మల్లయ్య, సైదులు, వెంకన్న, లింగమ్మ, సైదమ్మ, సునీత, విజయ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *