వీధి వ్యాపారులపై దాడి తగదు

ప్రజా సమస్యలపై కదం తొక్కిన కాంగ్రెస్ 

అక్షిత ప్రతినిధి, కూకట్ పల్లి :
కూకట్ పల్లి నియోజకవర్గం, బాలానగర్ నర్సాపూర్ ఎక్స్ రోడ్ నందు, ఎన్నో ఏండ్లుగా రోడ్ ప్రక్కన చిన్న చిన్న వ్యాపారాలు , తోపుడు పండ్ల వ్యాపారులు వ్యాపారం చేసుకుంటూ జీవనాధారం పొందుతున్న పేద ప్రజలను రాత్రికి రాత్రి బలవంతంగా ఖాళీ చేపించి, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చెయ్యకుండా వాళ్ళ జీవనాధారం పై క్రూరమైన దాడిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది,
నష్టపోతున్న చిరుపేద వ్యాపారస్తులు, బాలానగర్ డివిజన్ ఉపాధ్యక్షుడు ఆకుల నరేందర్ ఆధ్వర్యంలో మేడ్చల్ డిస్ట్రిక్ట్ జాయింట్ సెక్రటరీ యుగంధర్ రెడ్డి, ని కల్సి తమ సమస్యను చెప్పుకొన్నారు.దీనికి స్పందించిన ఆయన వెంటనే ఆయా ప్రాంతాలలో పర్యటించి, సంబంధిత జి,హెచ్,ఎంసి, అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని, లేని పక్షంలో ప్రజా పోరాటానికి సిద్ధమౌతామని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ మధు గౌడ్, సీనియర్ నాయకుడు వెంకటరమణ, ముక్తార్అహ్మద్, శివ,సోను,ఇర్ఫాన్,జాకీర్, మహమ్మద్,సలీం మొదలైన వారు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *