శ్రీ కృష్ణ కాలనీ అధ్యక్షులుగా లక్ష్మణ్

కాలనీ అభివృద్ధికి కృషి

కాలనీ అధ్యక్షులు లక్ష్మణ్
శేరిలింగంపల్లి, అక్షిత ప్రతినిధి :
శ్రీ కృష్ణ కాలనీ బాధ్యతలు మళ్లీ నాకు అప్పగించినందుకు అందరికీ పేరు పేరునా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను అని నూతన అద్యక్షులు ఎల్ లక్ష్మణ్ తెలిపారు.కాలనీ సమస్యలు కాలనీ అబివృద్ది కొరకై శాయ శక్తులు ఉపయోగించి పోరాడుతాను అని ప్రజాప్రతినిధుల సేవలని ఉపయోగించు కుంటానన్నారు. తెరాస పార్టీ సీనియర్ నాయకులను వి జగదీశ్వర్ గౌడ్, సత్యనారాయణల సహకారంతో పనులు పూర్తి చేస్తానని తెలిపారు అలాగే భేరి రాంచందర్ యాదవ్ మాట్లాడుతూ శ్రీ క్రిష్ణ కాలనీ నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శికి సన్మానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ క్రిష్ణ కాలనీ అభివృద్ధి కొరకు అందరూ కలిసికట్టుగా ఐక్యమత్యంతో పనిచేయాలని నూతన అసోసియేషన్ సభ్యులకు అంకితభావంతో పనిచేయాలని అన్నారు. గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పోరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా, రాగం నాగేందర్ యాదవ్ సహకారాలతో మన ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు అరికపూడి గాంధీ దృష్టికి తీసుకువెళ్లి వారి సహకారం తీసుకుని ఏ పని అయినా చేయడానికైన ముందుంటానన్నారు.మరి కాలనీ వారితో కూడా వర్గాలు లేకుండగా అందరూ నా వాళ్ళని కలిసికట్టుగా అందరము కూడా ఏకతాటిగా కలిసి నడుచుకుంటామని కాలనీ వాసులు అందరి అభిప్రాయాలు నా పై పెట్టుకున్న వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా నా మీద ఉన్న నమ్మకాన్నినేను కాపాడుతనని ఎల్ లక్ష్మణ్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *