ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత

*ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలి*

*దైవ చింతనతో మానసిక ప్రశాంతత*

*ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్*

సూర్యాపేట, అక్షిత బ్యూరో/కోదాడ:

ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలమార్చుకోవాలని శాసనసభ్యులు బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. ఆదివారం అనంతగిరి మండలంలోని అనంతగిరి, త్రిపురవరం గ్రామల్లో గంగమ్మ,పెద్దమ్మ తల్లుల పండుగ సందర్భంగా ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో సుభిక్షంగా జీవించేలా అమ్మవార్ల ఆశీస్సులు కలకాలం కొనసాగాలని ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో జాగ్రత్తలు పాటిస్తూ భక్తిశ్రద్ధలతో పండుగను జరుపుకోవాలని అన్నారు. దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. ప్రభుత్వం దేవాలయ అభివృద్ధికి పెద్ద పీట వేసిందని అన్నారు.నియోజకవర్గంలో దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.అనంతరం ఎమ్మెల్యే మల్లయ్యయాదవ్ ను ఆలయ కమిటీ సభ్యులు సన్మానించారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర సుధారాణి పుల్లారెడ్డి, ఎంపీపీ చుండూరు వెంకటేశ్వర్లు, జెడ్ పి టి సి ఉమా శ్రీనివాసరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు గింజుపల్లి రమేష్, సర్పంచులు వెంకటయ్య ,రంగారెడ్డి, ఈదుల కృష్ణయ్య, ,టిఆర్ఎస్ నాయకులు ,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *