పెగాసస్ స్పై వేర్ తో మోడీ ప్రభుత్వం దొంగాట – డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ చైర్మన్

వరంగల్, అక్షిత ప్రతినిధి: వరంగల్ జిల్లాలోని హన్మకొండలో రామకృష్ణ ఆఫీసులో ప్రకటన విడుదల చేస్తూ వరంగల్ జిల్లా ఎస్ సి డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ పెరుమండ్ల రామకృష్ణ మాట్లాడుతూ పెగాసస్ స్పై వేర్ అనే టెక్నాలజీతో ఇజ్రాయేలు వారి యొక్క దేశ సమగ్రతను కాపాడుకొనుటకు వినియోగిస్తున్నారు . కానీ దానిని ఉపయోగించి కేంద్ర ప్రభుత్వము దొంగాట ఆడుతుంది. కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ ,కేంద్ర రాష్ట్రాలలో ఉన్న కాంగ్రెస్ నాయకుల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారు బిజెపి యేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులవి , జర్నలిస్టులవి, వివిధ రాజకీయ పార్టీల నాయకులవి, దేశం కోసం పని చేసే వివిధ రకాల నాయకుల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారు. భారతదేశ రాజ్యాంగం కల్పించిన హక్కులో భాగము గోప్యత కూడా కుటుంబ సభ్యులు, మిత్రులు, భార్య భర్తలు మాట్లాడుకున్న మాటలు కూడా ఈ విధంగా దొంగచాటుగా వింటున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి నీచమైన పనులు చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు పరిపాలన సరిగ్గా సాగిస్తుంటే ప్రజలలో మీకెందుకు ఈ విధంగా వ్యతిరేకత వస్తుంది వ్యతిరేక భావన ఉంది ఏమేమి మాట్లాడుకుంటున్నారో అని తెలుసుకోవడం కోసం మీరు ఈ విధంగా చేస్తున్నారు .మీ పరిపాలన బాగా ఉంటే ప్రజలు మీకు బ్రహ్మరథం పడతారు. నిత్యవసర వస్తువులు పెరుగుదల, పెట్రోల్ డీజిల్ పెరుగుదల, భూమి ధరల పెరుగుదల , హాస్పిటల్ వైద్య ఖర్చులు పెరుగుదల, విద్య ఖర్చులు పెరుగుదల, సామాన్య మానవుడి నడ్డి విరిచే విధంగా అన్ని రకాల వస్తువుల మీద ధరలు పెంచి మరియు టాక్స్ రూపంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి పిరికిపంద చర్యలు మానుకొని ప్రజల అవసరాలు ఏమిటో తెలుసుకొని ప్రజల బాగోగుల కోసం వాళ్లు ఎన్నుకున్న నాయకులు కాబట్టి, వాళ్లకు మంచి చేసే విధంగా చూడాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు 7 వ డివిజన్ ఎస్సీ విభాగం డివిజన్ ప్రెసిడెంట్ జన్ను నరేందర్, కందికొండ ఏక నాదం తదితర నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *