నలుగురు అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్లు అరెస్టు

వరంగల్, అక్షిత బ్యూరో: మహరాష్ట్రకు చెందిన నలుగురు అంతర్ రాష్ట్ర స్మగర్లను టాస్క్ ఫోర్స్ మరియు మామూనూర్ పోలీసులు సంయుక్తంగా కల్సి శనివారం అరెస్టు చేసారు. నిందితుల నుండి సుమారు 5లక్షల రూపాయల విలువగల 50కిలోల గంజాయితో పాటు ఒక కారు, మూడు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో

1. అజీజ్ ఖాన్, తండ్రి పేరు గవర్ ఖాన్, వయస్సు 41, రతన్ గంజ్, అమరావతి జిల్లా, మహరాష్ట్ర

2. రాజేష్ ఏ తోంట్రీ, తండ్రి పేరు హౌడు తోంబ్రే, కింకడి మట్, అకోలా జిల్లా, మహరాష్ట్ర

3. బి. వెంకటేష్, తండ్రి పేరు వరమేశ్, వయస్సు 23, ముత్తిజాపూర్, అకోలా జిల్లా, మహరాష్ట్ర

4. యం.డి ఇలియాస్, తండ్రి పేరు ఆహ్మద్ ఆలీ, బిస్మిల్లా నగర్, అమరావతి జిల్లా, మహరాష్ట్ర రాష్ట్రం.

ఈ అరెస్టుకు సంబంధించిన ఈస్ట్ జోన్ డిసిపి వెంకటలక్ష్మీ వివరాలను వెల్లడిస్తూ పోలీసులు అరెస్టు చేసిన నిందితులు నలుగురు అమరావతి ప్రాంతంలోని పండ్ల మార్కెట్లో రోజువారి కూలీగా పనిచేసేవారు. నిందితులందరు ఇరుగుపొరుగు గ్రామాలకు చెందిన వారు కావడంతో నిందితుల మధ్య స్నేహం కుదిరింది. దీనితో నిందితులందరు కల్సి మద్యం సేవించడంతో పాటు జల్సాలకు అలవాటు పడ్డారు. వీరికి వచ్చే అదాయం వీరి జల్సాలకు సరిపోకపోవడంతో నిందితులు సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనలో పడ్డారు. ఇందుకోసం వైజాగ్ ప్రాంతంలో తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి మహరాష్ట్రకు తీసువచ్చి ఇక్కడ ఎక్కువధరకు అమ్మడం ద్వారా పెద్దమొత్తంలో డబ్బు సంపాదించాలని నిందితులు ప్రణాళికను రూపొందించుకున్నారు. ఇందుకోసం నిందితుల్లో ఒకడైన అజీజ్ ఖానకు గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడే ఇమ్రాన్ అనే వ్యక్తితో పరిచయం వుండటంతో, గంజాయి కోరకు ఇమ్రాను నిందితులు సంప్రదించగా అన్నవరం ప్రాంతానికి వస్తే గంజాయిని ఇప్పిస్తానని నిందితులకు ఇమ్రాన్ తెలిపడంతో, నిందితులందరు గంజాయి తీసుకోవచ్చేందుకుగా అన్నవరం మహరాష్ట్ర నుండి అన్నవరంకు బయలుదేరి ఇమ్రాన్ ద్వారా గంజాయిని కోనుగోలు చేసిన నిందితులు కొనుగోలు చేసిన గంజాయిని తాము ప్రయాణిస్తున్న కారులో ఎవరికీ అనుమానం రాకుండా రహస్యంగా భద్రపర్చచారు, నిందితులు గంజాయితో రాజమండ్రి, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ కమిషనరేట్ మీదుగా మహరాష్టకు చేరుకొనే ప్రయత్నంలో నిందితులు కారులో గంజాయిని తరలిస్తున్నట్లుగా టా-ఫోర్స్ పోలీసులకు సమాచారం అందడంతో టాస్క్ఫర్స్ ఇన్స్పెక్టర్ గొర్రె మధు, మమూనూర్ ఇన్స్పెక్టర్ రమేష్, ఎస్.ఐ రాంచరణ్ మరియు వారి సిబ్బందితో కలిసి నిన్నటి రోజున మామూనూర్ పోలీస్ పటాలం వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా పోలీసులకు నిందితుల వాహనం అనుమానస్పదంగా కన్పించడంతో వాహనాన్ని తనీఖీ చేయగా వాహనంలో నిందితులు గంజాయి తరలిస్తున్నట్లుగా గుర్తించిన పోలీసులు డిప్యూటీ తాసిల్దార్ అధ్వర్యంలో నిందితులను పోలీసులు విచారించడంతో నిందితులు తాము పాల్పడుతున్న గంజాయి స్మగ్లింగ్ ను అంగీకరించడంతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకోని కారులోని గంజాయి, కారును స్వాధీనం చేసుకున్నారు.

గంజాయి స్మగ్లర్లను పట్టుకోవడంలో ప్రతిభ కనరిచిన టాస్క్ ఫోర్స్ ఎ.సి.పి ప్రతాప్ కుమార్, మామూనూర్ ఎ.సి.పి నరేష్ కుమార్, టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్

గోర్రె మధు, మామూనూర్ ఇన్ స్పెక్టర్ రమేష్, ఎస్.ఐ రాంచరణ్, ఏ.ఏ.ఓ సల్మాన్ పాషా, టాస్క్ ఫోర్స్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ సోమలింగం, కానిస్టేబుళ్ళు శ్రీనివాస్, రాజు, చిరంజీవి రాజేష్, శ్రవణ్, హోంగార్డ్ విజయ్ కుమార్ లను పోలీస్ కమిషనర్ అభినందించారని ఈస్ట్ జోన్ డిసిపి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *