స్మార్ట్ ఫోన్ తో ట్రాప్ చేసిన యువకుడి అరెస్ట్

*స్మార్ట్ ఫోన్ వలలో మైనర్ బాలిక

*ట్రాప్ చేసిన తిరుపతి యువకుడు
*మనోవేదనతో బాలిక తండ్రి ఆత్మహత్య
*స్మార్ట్ ఫొన్ తస్మాత్ జాగ్రత్త: మామునూర్ ఏసిపి నరేష్ కుమార్

అక్షిత న్యూస్, పర్వతగిరి: చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ తో ఓ మైనర్ బాలిక తన తండ్రి చావుకు కారణమైన సంఘటన వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలం చౌటపల్లి గ్రామం పరిధిలో చోటుచేసుకుంది. మామునూర్ ఏసిపి నరేష్ కుమార్ తెలిపిన వివరాల మేరకు పర్వతగిరి మండలానికి చెందిన ఓ మైనర్ బాలిక స్మార్ట్ ఫోన్ కు అలవాటుపడి ఫేస్ బుక్ లో అనుక్షణం గడుపుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతికి చెందిన రాజశేఖర్ అనే 28 సంవత్సరాల యువకుని ట్రాప్ లో చిక్కుకొని తల్లిదండ్రులకు చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయింది. కూతురు కనిపించకపోవడంతో ఆమె తండ్రి మంత్రి నాగరాజు పర్వతగిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తుండగానే కూతురు విషయంలో తీవ్ర మనస్తాపానికి గురైన నాగరాజు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లో నుంచి వెళ్లిపోయిన బాలిక తనతో సెల్ఫోన్ కూడా తీసుకు వెల్లకపోవడంతో ఈ కేసును ఛేదించడం పోలీసులకు సవాలుగా మారింది. అయితే నూతన టెక్నాలజీ ఆధారంగా కేసును విచారించిన పోలీసులు తిరుపతికి చెందిన పైడి రాజశేఖర్ అనే యువకునితో ఫేస్ బుక్ లో ప్రేమ ట్రాప్ లో పడ్డట్లు నిర్ధారించుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సిఐ విశ్వేశ్వర్ ,ఎస్సై నవీన్ కుమార్ ఆధ్వర్యంలో బృందాలుగా విడిపోయి బాలిక ఆచూకీ కనిపెట్టారు. రాజశేఖర్ వద్ద ఉన్న మైనర్ బాలికను చైల్డ్ హోమ్ కు తరలించారు. ఇక ప్రేమ పేరుతో బాలికను ట్రాప్ చేసిన రాజశేఖర్ పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. ఇక స్మార్ట్ఫోన్ల వినియోగం వల్ల పిల్లలు బలవుతున్నారని ప్రశాంతంగా ఉన్న కుటుంబాల్లో స్మార్ట్ ఫోన్లు విపరీత వాడకం కలకలం రేపుతోందని పర్వతగిరి సిఐ విశ్వేశ్వర్ అన్నారు. ప్రస్తుత నేపథ్యంలో ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తుండడంతో పిల్లలకు స్మార్ట్ ఫోన్లు అనివార్యమయ్యాయి అయితే ఆన్లైన్ క్లాసులు వింటున్నారో లేదో తల్లిదండ్రులు గమనించాలని సోషల్ మీడియా వ్యాపకం నుండి పిల్లలకు దూరంగా ఉంచాలని ఏసీపీ నరేష్ కుమార్ అన్నారు ఇక ఈ కేసులో ప్రతిభ కనబరిచిన సిఐ విశ్వేశ్వర్, ఎస్సై నవీన్ కుమార్ మరియు పోలీస్ సిబ్బందిని ఏసీపీ అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *