స్కైలాబ్ కుటుంబ సభ్యులకు పరామర్శ

ధీరావత్ కుటుంబ సభ్యులకు భాస్కర్ రావు, సిద్దార్ధ పరామర్శ 

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

దేవరకొండ నియోజకవర్గం దివంగత మాజీ శాసనసభ్యులు ధీరావత్ రాగ్యా నాయక్ తల్లి ధీరావత్ ద్వాలి (105) ఆదివారం మృతి చెందారు. శతాధిక వయస్కురాలైన ద్వాలి వృద్ధాప్యం కారణంగా తన నివాసంలో తుది శ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. గొప్ప మానవతావాది, మాతృమూర్తి ద్వాలి భౌతికకాయాన్ని భాస్కర్ రావు సందర్శించి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించి నివాళి అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి మనోధైర్యం కల్పించారు. అంతకుముందు ద్వాలి భౌతిక కాయాన్ని ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్, యువనేత నల్లమోతు సిద్దార్ధ సందర్శించి పూలమాల వేసి నివాళి అర్పించారు. వీరితో పాటు డీసీఎంఎస్ వైస్ చైర్మన్ దుర్గంపూడి నారాయణ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు ధీరావత్ స్కైలాబ్ నాయక్, ఎంపీపీ ఆంగోతు నందిని రవితేజ, జడ్పీటీసీ ఆంగోతు లలిత హాతీరాం నాయక్, కల్లేపల్లి దేవాలయ కమిటీ అధ్యక్షులు పాచు నాయక్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు వీరకోటి రెడ్డి, ఎంపీటీసీ బాల సత్యనారాయణ, సర్పంచ్ పున్నా నాయక్, టీఆర్ఎస్వీ కార్యదర్శి షోయబ్, తదితరులు ధీరావత్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *