భక్తులతో కిటకిటలాడిన శైవ క్షేత్రాలు

నల్లమల అటవీ ప్రాంతంలో ఓంకార

నామస్మరణతో మారుమ్రోగిన శైవ క్షేత్రాలు

అచ్చంపేట,అక్షిత న్యూస్ : నల్లమల అటవీ ప్రాంతంలోని శివ క్షేత్రాలు మంగళవారం తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల శివనామస్మరణతో ఆలయాలు మారుమ్రోగాయి. మండలంలోని శ్రీశైల ఉత్తర ముఖద్వారమైన శ్రీ ఉమామహేశ్వర పుణ్యక్షేత్రంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తులు పోటెత్తారు. ఉమామహేశ్వర స్వామి వారి దర్శనానికి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ చైర్మన్ కందూరు సుధాకర్ ఆలయ ఈవో శ్రీనివాస రావు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో మైకులు ఏర్పాటుచేసి కరోనా నిబంధనలు పాటిస్తూ మాస్కులు ధరించి భౌతిక దూరంతో స్వామివారి దర్శనం చేసుకోవాలని భక్తులకు సూచిస్తున్నారు. కరుణ తగ్గుముఖం పట్టడంతో భక్తులు స్వామివారి దర్శనానికి అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ అధికారులు ఉమామహేశ్వర స్వామి కొండ పైకి ద్విచక్ర వాహనాలను కార్లను అనుమతించలేదు. భక్తులు తమ వాహనాలను భోగ మహేశ్వరంలో ఉంచి ప్రత్యేకంగా ఆర్టీసీ వారు ఏర్పాటుచేసిన బస్సులో వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అచ్చంపేట ఎస్సై ప్రదీప్ కుమార్, ఆర్ ఎస్ ఐ అజ్మీర్, సిద్దాపూర్ ఎస్ఐ రాజులు తమ పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలంటూ ఆలయ అధికారులు దర్శనానికి వచ్చే భక్తులకు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *