20న ప్రగతి భవన్ ముట్టడి

ప్రగతి భవన్ ముట్టడిని జయప్రదం చేయండి

ఎస్ ఎఫ్ ఐ మండల అధ్యక్షుడు దున్న రవి

దేవరకొండ ,పెద్దఅడిశర్లపల్లి, అక్షిత న్యూస్ :

తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల నోటిఫికేషన్ సాధనకై, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఆగస్ట్ 20 న ఎస్ ఎఫ్ ఐ,డివైఎఫ్ ఐ ఆధ్వర్యంలో జరిగే ప్రగతిభవన్ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలనిఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షుడు దున్నా రవి పిలుపునిచ్చారు. నీళ్ళు నిధుల నియామకాలు అంటూ గద్దెనెక్కిన టీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని పక్కనపెట్టిందన్నారు. స్వరాష్ట్ర సాధన ఏ లక్ష్యం కోసం,ఏ ఆశయ సాధన కోసం జరిగిందో అది నెరవేరలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఉద్యోగాల జాతర ప్రభుత్వం అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలుగా
పేపర్లకే పరిమితమయాయని అన్నారు. ఆత్మహత్యలు పెరిగిపోయాయని ఆదుకోవాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తూ కూర్చున్నదని వారూ పేర్కొన్నారు. ఉపాధి ఆకాంక్షలు ఇరవై అయిదు లక్షలు అయితే రాష్ట్రంలో
ఊడబీకినా కొలువులు యాభైవేలు దాటినాయని, ఉద్యోగాలు ఇచ్చింది మాత్రం లక్ష కూడ లేవని
ఊరికో కోడి ఇచ్చి ఇంటికో ఈకన్నట్టుగా ప్రభుత్వ పరిపాలన కొనసాగుతున్నదన్నారు. యువకుల మీద నిరుద్యోగ భూతం కరాలనృత్యం చేస్తున్నదని ఆ సుడిగుండం లో చిక్కుకున్న యువత తీవ్రంగా సమస్యలు ఎదుర్కొంటున్నరాని వారంతా ఆగస్ట్ 20 న ప్రగతిభవన్ కెళ్ళి మా ఉద్యోగ0 ఎక్కడ అని ముఖ్యమంత్రిని ప్రశ్నియించాలని వారు పిలుపునిచ్చారు.
తెలంగాణ వచ్చినా ఉద్యోగాలు రాలేదని
తెగనమ్మిన కేసిఆర్ యువకులను మోసం చేశాడని
తెగించి కొట్లాడగొచ్చిన రాష్ట్రం ఎమాయె అని నేడు యువత ఉద్యమం కు సిద్ధమవ్వాలని పేర్కొన్నారు. కొలువుల సాధనకు విద్యార్థులు ,యువకులు
హైదరాబాద్ కు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎస్ఎఫ్ఐ నాయకులు శ్రీను, నాగేంద్రప్రసాద్. నాగ నాయక్,సమద్, రవి,పవన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *