పచ్చదనానికి విశ్వ వేదికగా… పాలమూరు

సీడ్ బాల్స్ లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్

మంత్రి శ్రీనివాస్, ఎంపి సంతోష్ కు కేసీఆర్ ప్రశంస

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

సమైక్య పాలనలో వలసలకు.. ఆకలి చావులకు నిలయమైన పాలమూరు జిల్లా స్వరాష్ట్ర పాలనలో పచ్చదనానికి విశ్వవేదికగా నిలిచిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టుల ద్వారా అందిస్తున్న సాగునీటి జలాలతో నేడు ఎటు చూసినా పచ్చని పంటలతో కనువిందు చేస్తున్నదన్నారు. బీడు భూములు, రాళ్లు గుట్టలకే ఇన్నాల్లూ పరిమితమైన పాలమూరు పచ్చదనంతో తన రూపు రేఖలను మార్చుకుని, వినూత్న రీతిలో అభివృద్ధి పథంలో ముందుకు దూసుకు పోతుండడం సంతోషకరమన్నారు.తెలంగాణకు హరిత హారం స్పూర్తితో, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా, సీడ్ బాల్స్ ను రికార్డు స్థాయిలో తయారు చేసి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా వెదజల్లడంలో జిల్లా యంత్రాంగం సక్సెస్ అయింది. సీడ్ బాల్స్ తో అత్యంత పొడవైన వాక్యాన్ని నిర్మించడం ద్వారా సాధించిన గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డు’’ జ్జాపికను శుక్రవారం ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ చేతులమీదుగా ఎంపీ జోగినపెల్లి సంతోష్ కుమార్, మంత్రి శ్రీనివాస్ గౌడ్ లు అందుకున్నారు. సీఎం కేసీఆర్ వారి కృషిని అభినందించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ పచ్చదనాన్ని సాధించే దిశగా రికార్డు స్థాయిలో, 10 రోజుల్లో 2 కోట్ల 10 లక్షల సీడ్ బాల్స్ ను ఒకనెలలో తయారు చేసి కొండలు గుట్టల ప్రాంతాల్లో వెదజల్లడం ద్వారా పచ్చదనం అభివృద్ధికి పాటుపడుతున్న పాలమూరు జిల్లా మహిళా స్వయం సహాయక బృందాల కృషిని సీఎం అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *