ఉపకారవేతనాలకు దరఖాస్తులు సమర్పించాలి

కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి

సూర్యాపేట, అక్షిత బ్యూరో :

జిల్లాలోని ప్రభుత్వ, ప్రయివేట్ మరియు ఎయిడెడ్ కళాశాలల్లో పెండింగ్ లో ఉన్న ఎస్సి, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థిని, విద్యార్థుల ఉపకార వేతనాల హార్డ్ కాపీలను ఈ నెల 31 తారీఖులోగా సమర్పించాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి కళాశాలల ప్రిన్సిపాళ్లకు ను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ కళాశాలల ప్రిన్సిపాల్స్ తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలలో విద్య నభ్యసిస్తున్న ఎస్సి, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు స్కాలర్ షిప్స్ విడుదల చేయాలన్నారు. సమావేశానికి హాజరు కానీ ప్రిన్సిపాల్స్ పై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈనెల21 న జరిగే సమావేశానికి ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్ తప్పకుండా హాజరు కావాలన్నారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎస్ మోహన్ రావు,జిల్లా షెడ్యూల్డ్ కులాల అధికారి దయానంద రాణి,వివిధ కళాశాలల ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *