ములుగు జిల్లా కన్వీనర్ గా సంద బాబు

*జాతీయ బీసి సంక్షేమ సంఘం ములుగు జిల్లా కన్వీనర్ గా సంద బాబు 
*ములుగు, అక్షిత బ్యూరో : జాతీయ బిసి సంక్షేమ సంఘం ములుగు జిల్లా కన్వీనర్ గా ములుగు పట్టణానికి చెందిన సందబాబును నియమించినట్లు జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య,రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ చేతుల మీదుగా నియామక పత్రాన్ని హైదరాబాదులోని తన స్వగృహంలో అందించారు.ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షులు కృష్ణయ్య మాట్లాడుతూ బీసీ కులాలు ఆర్థిక,రాజకీయ,సామాజిక రంగాల్లో రాణించడానికి కృషి చేయాలని,బీసీలకు జరుగుతున్న అన్యాయాలపై పోరాడి పరిష్కారాల వైపు నడిపించాలని అన్నారు.సామాజిక, సాహిత్య,సేవలతో పాటు,ప్రత్యేకంగా వితంతు ఒంటరి మహిళల అభ్యున్నతి కోసం నిరంతర ప్రజాచైతన్య కార్యక్రమాల నిర్వహణను గుర్తించి జిల్లా కన్వీనర్ బాధ్యతలను అప్పగించినట్లు తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ సందబాబు మాట్లాడుతూ కన్వీనర్ నియామకానికి కృషిచేసిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుట్టి శ్యాం యాదవ్,రాష్ట్ర కార్యదర్శి,ములుగు, భూపాలపల్లి జిల్లాల ఇంచార్జి మొగుళ్ళ భద్రయ్యలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.జిల్లాలో బీసీ సంక్షేమ సంఘం పటిష్టతకోసం పాటుపడతానని తెలిపారు.ఈ కార్యక్రమంలో జయశంకర్ జిల్లా కన్వీనర్ తాటికంటి రవికుమార్ లు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *