సాగర్ కు తగ్గిన వరద

ఎగువ శ్రీశైలం నుండి1,40,056 క్యూసెక్కులు రాక
అక్షిత ప్రతినిధి, నాగార్జునసాగర్ :
నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వచ్చే వరద తగ్గు ముఖం పట్టింది. ఎగువ శ్రీశైలం ప్రాజెక్టు పది గేట్లను పది అడుగుల మేర ఎత్తి 1,40,056 క్యూసెక్కులు వరద నీరు సాగర్ జనసేన వచ్చి చేరుతున్నాయి. దీంతో సాగర్ ప్రాజెక్టు యొక్క నాలుగు గేట్లను ఐదు అడుగుల మేరకుఎత్తు దిగువ కృష్ణానదిలోకి 31,180 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. గత మూడు రోజుల నుండి నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు 5,45,000 క్యూసెక్కుల వరద నీరు రావడంతో ప్రాజెక్టు యొక్క 22 గేట్లను పది అడుగుల మేరకు ఎత్తి కృష్ణానది లోనికి విడుదల చేస్తున్నారు. మంగళవారం మధ్యాహ్న సమయంలో ఎగువ నుంచి వచ్చే వరద తగ్గటంతో ప్రాజెక్టు యొక్క ప్రాజెక్టు గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం సాగర్ జలాశయం నీటి మట్టం 587.10 అడుగులుగా ఉంది.ఇది 305.5646 టీఎంసీలకు సమానము. ఎడమ కాలువ ద్వారా 601 క్యూసెక్కులు నీరు
ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా33,779 క్యూసెక్కులు విడుదల కాగా జంటనగరాలకు తాగునీటి అవసరాల నిమిత్తం ఎస్ఎల్బీసీ ద్వారా 1100 క్యూసెక్కులు వరద కాలువ ద్వారా 600 క్యూసెక్కుల నీరు మొత్తంగా ప్రాజెక్టు నుండి 67,960 క్యూసెక్కుల వరద నీరు బయటకు విడుదల అవుతుంది. ఎగువ శ్రీశైలం నుండి 1,40,056 క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లో గా వచ్చి చేరుతుంది. ప్రస్తుతం శ్రీశైల జలాశయం నీటి మట్టం 884.40 అడుగులుగా ఉంది. ఇది 211.9572 టీఎంసీలకు సమానము. శ్రీశైలం ప్రాజెక్టుకు వివో నుంచి 2,08,941 క్యూసెక్కుల వరద నీరు జలాశయంలో చేరుతుంది. కాగా ఎగువ కృష్ణా బేషన్ లో లో వరద తగ్గుముఖం పట్టడంతో దిగువనున్న సాగర్ ప్రాజెక్టు కూడా వరద తగ్గింది. దీంతో గురువారం ప్రాజెక్టు గేట్లు మూసి అవకాశముందని అధికారులు పేర్కొంటున్నారు.
.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *