ఆర్ కె వై టీమ్ ఆధ్వర్యంలో విశ్రాంత బెంచీలు

శేరిలింగంపల్లి, అక్షిత ప్రతినిధి: గురు పౌర్ణమిని పురస్కరించుకొని శనివారం రోజు శేరిలింగంపల్లి నియోజకవర్గంలో బిజెపి పార్టీ సీనియర్ నాయకులు రవి కుమార్ యాదవ్ పాపి రెడ్డి కాలనీ ,రాజీవ్ గృహకల్ప లోని సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజలు జరుపుకొని మక్త మహబూబ్ పేటలోని హిందూ స్మశాన వాటికలో ఆర్ .కే .వై టీం సభ్యులు ఏర్పాటు చేసిన విశ్రాంతి కుర్చీలను ప్రారంభించి,స్మశాన వాటికలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ గురువు అంటే పరబ్రహ్మ తో సమానం అని,అజ్ఞానమనే చీకటిని తొలగించేవారు అని సంస్కృతంలో అర్థం అన్నారు.అష్టాదశ పురాణాలను భావితరాలకు అందించిన వ్యాసమహర్షి ఆషాడ శుద్ధ పౌర్ణమి రోజున జన్మించాడు .అందుకే ఈ పౌర్ణమిని వ్యాస పౌర్ణమి అని కూడా అంటారని తెలిపారు. బడుల్లో పాఠాలు నేర్పించే వారే కాకుండా జీవిత సారాన్ని బోధించిన వారిని ,సిద్ధ పురుషులను కూడా గురువుగా భావిస్తారన్నారు. అందుకే గురువులకు మన సాంప్రదాయం లో అగ్ర తాంబూలం ఇస్తారని తెలిపారు.అదే గురుపౌర్ణమి అని రవి కుమార్ యాదవ్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మియాపూర్ డివిజన్ కంటెస్టెంట్ కార్పొరేటర్ రాఘవేంద్రరావు,.గుండె గణేష్ ముదిరాజ్. మల్లేష్, జాజిరావు శ్రీను, రవీందర్, వినోద్ యాదవ్ .బాబు ముదిరాజ్ .వెంకటేష్. రాము, చంద్ర మాసి రెడ్డి .రామకృష్ణ .కిరణ్. రమేష్. రవీందర్ .నరేష్. మొదలగు వారు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *