రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు తగదు

టిఆర్ఎస్ ఎమ్మెల్యేల దిష్టిబొమ్మల దగ్ధం

అచ్చంపేట, అక్షిత ప్రతినిధి :
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై టిఆర్ఎస్ చెందిన ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, గండ్ర వెంకటరమణా రెడ్డి బాల్క సుమన్ లు రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల ఆగ్రహించిన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు శనివారం రాత్రి అమ్రాబాద్ మండల కేంద్రంలో ఎన్ ఎస్ యు ఆధ్వర్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచి టిఆర్ఎస్ల చేరిన ఎమ్మెల్యేలు నోరు అదుపులో పెట్టుకోవాలని లేకపోతే మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. డబ్బుకు పదవులకు ఆశపడి కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసి  టిఆర్ఎస్ లో చేరాలని వారు చరిత్రహీనులుగా మిగిలిపోతారని అన్నారు. ఎమ్మెల్యేలుగా ఉంటూ తమ స్థాయిని మరిచి అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అజయ్ యాదవ్, జిల్లా యువజన కాంగ్రెస్ కార్యదర్శి పవన్ కుమార్ యాదవ్, సీనియర్ నాయకులు బాహుబలి, కాంగ్రెస్ నాయకులు గౌస్ బాలకృష్ణ, వెంకటేష్ యాదవ్, మహేష్ యాదవ్ ,శివ ,ఖదీర్ ,శ్రీను ,షోయబ్, రాజేష్ ,సలేశ్వరం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *