సమిష్టి నిర్ణయాలతోనే కాంగ్రెస్ కార్యకలాపాలు

అధ్యక్షుడిగా వ్యక్తిగత నిర్ణయాలు ఉండవు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

కాంగ్రెస్ అధ్యక్షుడిగా వ్యక్తిగత నిర్ణయాలు ఉండవని, సమిష్టి నిర్ణయాలు మాత్రమే ఉంటాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. టీపీసీసీ ఛీప్‌గా నియామకమైన ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో ప్రజల పునరేకీకరణ జరగాల్సిన అవసరం ఉందని చెప్పారు. అలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు తన పాదయాత్ర ఉండే అవకాశం ఉందని తెలిపారు. అది ఎప్పుడు అనేది పార్టీ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఇపుడున్న పరిస్థితులలో ఎన్టీఆర్, వైఎస్సార్‌లను విమర్శించడం వికృతమైన చర్యగా రేవంత్ రెడ్డి అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తాను అండగా ఉంటానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టం ఇప్పుడు తిరుగుబాటుగా మరాల్సిన అవసరం ఉందన్నారు. టీఆర్ఎస్, బీజెపీ కలసి పోటీ చేసిన లింగోజి గూడలో కాంగ్రెస్ పార్టీ గెలిచిందని గుర్తు చేశారు. లింగోజి గూడ వ్యవహారంలో ప్రగతి భవన్ వెళ్లినందుకు బీజేపీ కమిటీ ఇచ్చిన నివేదికపై ఏ చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. ఎప్పటిలోగా చర్యలు తీసుకుంటారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని రేవంత్ రెడ్డి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *