మత సామరస్యానికి కేసీఆర్ పెద్దపీట

బిజెపి వాళ్లు ప్రజా వ్యతిరేకులు

మంత్రి కొప్పుల ఈశ్వర్

హుజూరాబాద్, అక్షిత ప్రతినిధి :
కొప్పుల ఈశ్వర్ ఆదివారం జమ్మికుంట ఎఫ్ సి ఐ గోదాంల సమీపాన ఉన్న చర్చి అభివృద్ధికి 10 లక్షలు,లారీ డ్రైవర్ల అసోసియేషన్ భవన నిర్మాణానికి 15 లక్షలు మంజూరు చేసి అనుమతి పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బిజెపి మతోన్మాద,ప్రజా వ్యతిరేక పార్టీ
ఎస్సీ,ఎస్టీ, బీసీ, క్రిస్టియన్లు,ముస్లింలు అంటే ఆ పార్టీకి,ఆ పార్టీ నాయకులకు పడదుఆ పార్టీకి గుండాలు క్రిస్టియన్లు,చర్చిలపై దాడులకు దిగుతుంటరు. అందుకు విరుద్ధంగా మన  ముఖ్యమంత్రి కెసిఆర్ మత సామరస్యానికి పెద్ద పీట వేస్తున్నరు.అన్ని కులాలు,మతాల వారిని సమానంగా చూస్తున్నరు, భద్రతకు, సంక్షేమానికి, సముద్ధరణకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నరు హైదరాబాద్ కోకాపేటలో క్రిస్టియన్ భవనాన్ని గొప్పగా కడ్తున్నం.బరియల్ గ్రౌండ్స్ కు స్థలాలు కేటాయించాం, అభివృద్ధికి నిధులిస్తున్నం ప్రతి ఏటా క్రిస్మస్ సందర్భంగా పేదలకు దుస్తులు పంపిణీ చేస్తున్నం.చర్చిల నిర్మాణం, మరమ్మత్తుల కోసం ఆర్థిక సాయం అందిస్తున్నం. ఈ సందర్భంగా చర్చి అభివృద్ధికి 10లక్షలు, లారీ డ్రైవర్ల అసోసియేషన్ భవన నిర్మాణానికి 15లక్షలు మంజూరు చేసి అనుమతి పత్రాలను అందజేశారు .
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్, మునిసిపల్ ఛైర్మన్ రాజేశ్వరరావు, టిఆర్ఎస్ పట్టణ శాఖ అధ్యక్షుడు రాజ్ కుమార్ , బుగ్గారం జడ్పీటీసీ బాదినేని రాజేందర్,కౌన్సిలర్లు మల్లయ్య, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *