రావిరాల సభకు తరలిన కాంగ్రెస్ శ్రేణులు

రావిర్యాల సభకు తరలి వెళ్ళిన గాలి బాలాజీ

కూకట్ పల్లి, అక్షిత ప్రతినిధి : నిరంకుశ టిఆర్ఎస్ పాలన అంతమొందించేందుకు మరో రెండేళ్లపాటు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో పోరాటం చేస్తామని టిపిసిసి కార్యదర్శి గాలి బాలాజీ అన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని రావిర్యాలలో తలపెట్టిన దళిత గిరిజన దండోరా సభకు కూకట్ పల్లి నియోజకవర్గం గాలి బాలాజీ, మొయిజ్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున బైక్ ర్యాలీతో తరలివెళ్లారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వం అని స్పష్టం చేశారు. హుజరాబాద్ ఉప ఎన్నిక వల్లనే ఆ నియోజకవర్గంలో దళితుల ఓట్లు అత్యధికంగా ఉండడంతో వారి ఓట్లతో ఉప ఎన్నికల్లో విజయం కోసమే దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారని ఆయన ఆరోపించారు. దళితులపై అభిమానము ఉంటే 119 నియోజకవర్గాల్లో ప్రతి దళిత బిడ్డకు దళిత బంధు పథకం మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కెసిఆర్ కు ఎన్నికలు వచ్చినప్పుడే దళిత గిరిజన అట్టడుగు వర్గాలు గుర్తుకొస్తారు అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *