రామప్ప ప్రగతికి కృషి

రామప్పను సందర్శించిన మంత్రులు

రామలింగేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేసిన మంత్రులు శ్రీనివాస్ గౌడ్,ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్

ములుగు, అక్షిత బ్యూరో :

వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలోని రామప్ప దేవాలయానికి ఇటీవలే యునెస్కో గుర్తింపు లభించిన విషయం తెలిసిందే.ఈ సందర్భంగా యునెస్కో నిబంధనల ప్రకారం పర్యాటక పరంగా మరింత అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. అందులో భాగంగా మంగళవారం రామప్పను రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్,రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్,పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు,గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్,కేంద్ర,రాష్ట్ర పురావస్తు శాఖ, పర్యాటక శాఖ అధికారులతో కలిసి సందర్శించారు.ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రామప్పకు యునెస్కో గుర్తింపుతో ములుగు జిల్లా పర్యాటకంగా అభివృద్ది సాధించడంతో ఉపాధి పెరుగుతుందన్నారు. వందల వేల సంవత్సరాల మన ప్రాంతంలోని చక్రవర్తులను భాషను,సంస్కృతిని గుర్తింపు తీసుకు వస్తున్నామన్నారు. యునెస్కో గుర్తింపు పొంది వరల్డ్ హెరిటేజ్ మ్యాప్ లో చోటు సంపాధించుకున్న అటవీ ప్రాంతంలోని రామప్ప గుడి వల్ల మన పూర్వీకుల జీవితాలు దానివెకన దాగి ఉన్నాయని తెలిపారు.కట్టింది రాజైనా,ఆ నాటి సైన్యాధిపతులు,వారి కింద పనిచేసిన సైనికులు,ఆ నాటి ప్రజల కష్టం ఎలా ఉందో ఆలయ శైలి చూస్తేనే అర్థం అవుతుందన్నారు.తాజ్ మహల్ లా గుర్తించి ఉంటే వరంగల్ బతుకులు మారేవి గత పాలకులు యునెస్కో గుర్తింపు కోసం ఏమాత్రం ప్రయత్నం చేయలేదని,తాజ్ మహల్ లా ఆనాడే గుర్తించినట్లయితే వరంగల్ బతుకులు మారేవని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.ఈ ప్రాంతంలో ఏమి లేదని మేమే వచ్చి చేశామని నాటి పాలకులు భ్రమలు కల్పించారని ఆయన విమర్శించారు.తెలంగాణ వచ్చాక సంస్కృతి,సంప్రదాయాలను కాపాడుకుంటూ వస్తున్నామని,రామప్ప కు యునెస్కో గుర్తింపు కోసం ప్రభుత్వం రెండేళ్లుగా చేసిన కృషి ఫలిచిందన్నారు.రామప్ప పరిసర ప్రాంతాల్లో చేపట్టాల్సిన అభివృద్ది కోసం సీఎం సూచనతో పరిశీలనకు వచ్చామన్నారు.కేంద్రానికి పన్నులు కోట్ల రూపాయలు కడుతున్నాం.చాలా రాష్ట్రాల్లో కట్టిన పన్నులకంటే ఎక్కువ వస్తుందని,మనకు కూడా ఏదో రూపంలో రాష్ట్రానికి నిధులు ఇస్తే సంతోషిస్తామన్నారు. రామప్ప ప్రాంతంలో అభివృద్ధి కోసం ప్రతిపాధనలు చేసి కేంద్రప్రభుత్వానికి పంపిస్తామని,రామప్ప దేవాలయం ప్రాంతంలో చేపట్టాల్సిన అభివృద్ధి గురించి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపిస్తామని ఆయన తెలిపారు.విదేశీ పర్యటకులకు కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామన్నారు.గత మూడు నాలుగేళ్లుగా 7 కోట్లు ఖర్చు చేశామని మరో 15 కోట్లతో ప్రతిపాధనలు సిద్దం చేశామన్నారు.రామప్ప తో పాటు సమాంతరంగా ఉన్న వేయిస్తంబాలు దేవాలయాలు,ఫోర్ట్ వరంగల్ ఇతర టెంపుల్స్,లేక్స్ తో కాకతీయ హెరిటేజ్ సర్క్యూట్ చేయాలన్న ఆలోచన చేస్తున్నామన్నారు.దీనిపై తుది నిర్ణయం తీసుకునే ముందు త్వరలోనే జిల్లా ప్రజాప్రతినిధులు,అధికారులతో హైదరాబాద్ లో మీటింగ్ పెడతామన్నారు.ఈ ప్రాంత పరిరక్షణ కోసం నిబంధనలకు విరుద్దంగా ఎలాంటి పనులు చేపట్టవద్దని ఆయన సూచించారు.ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం పరిసరాల్లో అభివృద్ది పనులకు ప్రజలు సహకరించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోరారు.రామప్ప కు యునెస్కో గుర్తింపు రావడంలో రష్యా లీడ్ తీసుకుందని,మద్దతిచ్చిన 17 దేశాలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కృతజ్ఞతలు తెలిపారు.ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చేటు సంపాధించడంలో కృషిచేసిన కేంద్ర ప్రభుత్వానికి,స్వచ్చంద సంస్థలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.ఎమ్మెల్యే సీతక్క తోపాటు సర్పంచ్ లు,ప్రజాప్రతినిధులు, అధికారులు ఐక్యాంగా సహకరించాలన్నారు. ప్రభుత్వ భూమితోపాటు సీడ్ కార్పోరేషన్ భూమి ఉందని,రైతులు, గ్రామస్తులు సహకరించాలన్నారు.ఎవరికీ అన్యాయం చేయమని ఆయన స్పష్టం చేశారు.రామప్ప ప్రాంతంలో డబుల్ రోడ్లు,సెంట్రల్ లైటింగ్,ఇతర నిర్మాణాలకు ప్రతిపాధనలు ఇస్తే సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. రామప్పను పర్యాటక కేంద్రంగా అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు.కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ఏర్పాటు చేసి పాండురంగారావు,పాపారావు ఎంతో కృషి చేశారని గుర్తు చేసుకున్నారు.ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ ఈ ప్రాంతాన్ని టూరిజం హబ్ గా అభివృద్ది చేయాలని ఎమ్మెల్యే సీతక్క కోరారు. భవిష్యత్ లో జరిగే అభివృద్ది కోసం భూసేకరణ లో బాధితులకు పూర్తిస్థాయిలో న్యాయం చేయాలన్నారు.వారి వెంట మానుకోట ఎంపీ మాలోతు కవిత,ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి,జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్,జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య,ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి.పాటిల్,ములుగు ఏఎస్పీ సాయి చైతన్య ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *