రైతు వేదికలు… రైతులకు మేలు

మంత్రుల పర్యటనను విజయవంతం చేయాలి
* రేపు మిర్యాలగూడ కు మంత్రులు జగదీశ్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
* రైతు వేదిక భవనాలు, భూసార పరీక్షా కేంద్రం భవనం ప్రారంభం, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
* సన్నాహక సమావేశంలో ఎమ్మెల్యే భాస్కర్ రావు 

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :మిర్యాలగూడ నియోజకవర్గంలో రైతు వేదిక భవనాలు, భూసార పరీక్షా కేంద్రంతో పాటు పలు అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు రాష్ట్ర మంత్రులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి శనివారం విచ్చేయనున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సన్నాహక కార్యక్రమంలో శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు మాట్లాడారు. మంత్రుల పర్యటనను విజయవంతం చేసే దిశగా తగు ఏర్పాట్లను చేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రైతు వేదిక భవనాల ప్రారంభోత్సవాల అనంతరం నిర్వహించే రైతు సభల్లో మంత్రులు మాట్లాడతారని చెప్పారు. ఈ కార్యక్రమాలకు హాజరయ్యే ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు కోవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు రైతు వేదిక భవనాలు ఉపయోగపడతాయని భాస్కర్ రావు తెలిపారు. కాగా, రైతులను సంఘటితం చేసే లక్ష్యంతో నిర్మించిన రైతు వేదిక భవనాల నిర్మాణాలను సకాలంలో పూర్తి చేయించిన భాస్కర్ రావు వీటి యొక్క సేవలను అందుబాటులో తెచ్చేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. మిర్యాలగూడ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఒప్పించి ఐదు లిఫ్టులను మంజూరు చేయించారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో ఐదు రైతు వేదిక భవనాలు రేపు ప్రారంభం కానున్న నేపథ్యంలో పండువ వాతావరణం నెలకొంది. మిర్యాలగూడ పట్టణంలో భూసార పరీక్షా కేంద్రాన్ని మంత్రులు ప్రారంభించనున్నారు.

మంత్రుల పర్యటన షెడ్యూల్ :

* 07,ఆగస్టు 2021 (శనివారం ) ఉదయం 10 గంటలకు వేములపల్లి మండలంలో వేములపల్లి గ్రామములో రైతు వేదిక ప్రారంభోత్సవం, కేజీబీవీ పాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన
* ఉదాయం గం.10-30 నిమిషాలకు వేములపల్లి మండలంలో శెట్టిపాలెం గ్రామములో రైతు వేదిక ప్రారంభోత్సవం
* ఉదయం 11 గంటలకు మిర్యాలగూడ మండలంలో తుంగపహాడ్ గ్రామంలో రైతు వేదిక ప్రారంభం
* ఉదయం గం.11-30నిమిషాలకు దామరచర్ల మండలంలో కొండ్రపోల్ గ్రామంలో రైతు వేదిక భవనం ప్రారంభం
* మధ్యాహ్నం 12గంటలకు దామరచర్ల మండలంలో దామరచర్ల గ్రామములో రైతు వేదిక ప్రారంభోత్సవం, అనంతరం రైతు సభ నిర్వహణ
* మధ్యాహ్నం ఒంటి గంటకు మిర్యాలగూడ పట్టణం ఎన్ఎస్పీ క్యాంప్లో రైతు బజార్ వెనుక నూతనంగా నిర్మించిన భూసార పరీక్ష కేంద్ర భవనం ప్రారంభం
* మధ్యాహ్నం గం.2-30 నిమిషాలకు మిర్యాలగూడ పట్టణంలో షాబు నగర్, ఎంపీడీవో కార్యాలయం పక్కన నిర్మాణం పూర్తి అయిన రైతు వేదిక భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం, అనంతరం నిర్వహించే రైతు సభలో మంత్రులు ప్రసంగిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *